మహేష్ బాబు-కొరటాల శివ మూవీ టైటిల్

By Bojja Kumar

Mahesh Babu, Koratala Siva Movie Title
హైదరాబాద్: 'ఆగడు' తర్వాత మహేష్ బాబు నెక్ట్స్ సినిమా కూడా రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే. 'మిర్చి' ఫేం కొరటాల శివ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం ఇటీవల రామానాయుడు స్టూడియోలో జరిగింది. తాజాగా ఫిల్మ్ నగర్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 'కన్నయ్య' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ ఎంటర్టెనర్ గా కొరటాల శివ ఈచిత్రాన్ని తెరకెక్కించనుండటంతో ఈ టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందనున్న ఈ చిత్రానికి ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సి.వి.మోహన్ నిర్మాతలు. మహేష్ బాబు సరసన శృతిహాసన్ కథానాయికగా నటించనుంది. ఆగడు సినిమా షూటింగులో బిజీగా ఉండటం వల్ల మహేష్ బాబు ఇటీవల జరిగిన మూవీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాలేక పోయారు. అయితే ఆయన లేని లోటేను భర్తీ చేసేందుకు మహేష్ భర్య నమ్రత ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె స్పెషల్ అట్రాక్షన్ గా ఉన్నారు. ఆమెతో పాటు మహేష్ బాబు బావ స్వరూప్ కూడా హాజరయ్యారు.

ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న 'ఆగడు' చిత్రం చివరి దశకు చేరుకుంది. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఆగడు చిత్రంలో మహేష్ బాబు సరసన తమన్నా నటిస్తోంది. శృతి హాసన్ ఐటం సాంగు చేయడం మరో ప్రత్యేకత. తమన్ సంగీతం అందించారు. 'దూకుడు' వంటి భారి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత మహేష్ బాబు, శ్రీను వైట్ల, తమన్ కాంబినేషన్లో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాపై అభిమానులలో భారి అంచనాలున్నాయి.

ఈ చిత్రానికి అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలు. సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలో పాటల చిత్రీకరణ కోసం యూరఫ్ వెళ్లనున్నారు. నార్వే తో పాటు పలు ప్రాంతాల్లో పాటల చిత్రీకరణ జరుగనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X