మహేష్-క్రిష్ కాంబినేషన్ ఖరారు(అఫీషియల్)

ఇప్పటికే స్క్రిప్టు వర్క్ కంప్లీట్ చేసినట్లు స్పష్టం చేసిన ఈ దర్శకుడు...వచ్చే ఏడాది సమ్మర్లో షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు సంకేతాలు ఇచ్చాడు. ఈ చిత్రం పూర్తి కమర్షియల్ నేపథ్యంలో రూపొందించేందుకు దర్శకడు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదని ఆయన స్పష్టం చేసారు.
గమ్యం, వేదం లాంటి చిత్రాలతో క్రిష్ స్టార్ దర్శకుల లిస్టులో చేరి పోయారు. మరి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా అంటే ఇక ఈ ప్రాజెక్టుపై ఏ రేంజిలో అంచనాలు ఉంటాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా ఈ వార్త అధికారికంగా ఖరారు కావడంలో మహేష్ బాబు అభిమానుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది.
ప్రస్తుతం మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో ఓ సిసినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈచిత్రం పూర్తయిన తర్వాత మహేష్-క్రిష్ కాంబినేషన్ మొదలు కానుంది. ఇక పోతే క్రిష్ దర్శకత్వం వహించిన 'కృష్ణం వందే జగద్గురుమ్' చిత్రం రేపు గ్రాండ్ గా విడుదలువుతోంది.


Click it and Unblock the Notifications











