»   » మహేష్ ‘1-నేనొక్కడినే’ న్యూలుక్ అదిరింది(ఫోటోలు)

మహేష్ ‘1-నేనొక్కడినే’ న్యూలుక్ అదిరింది(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా సుకుమార్ దర్శకత్వంలో '1-నేనొక్కడినే' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మహేష్ బాబు సరికొత్త లుక్‌తో కనిపించబోతున్నాడు. ఇందుకోసం ఆయన ప్రత్యేకంగా ఫిట్‌నెస్ ట్రైనింగ్ తీసుకుని మరింత యంగ్ లుక్‌లోకి మారారు.

తాజాగా ఈ చిత్రంలో మహేష్ బాబుకు సంబంధించిన తాజాగా ఫోటోలు విడుదల చేసారు. ఆ చిత్రాల్లో మహేష్ బాబు మరింత యంగ్‌గా కనిపించడం చూస్తుంటే.....దర్శకుడు సుకుమార్ ఆయన్ను ఎంత డిఫరెంటుగా సినిమాలో ప్రజెంట్ చేసారో స్పష్టం అవుతోంది. ఈ సినిమా మహేష్ బాబు కెరీర్లో ఓ డిఫరెంటు చిత్రంగా ఉంటుందని టాక్.

ఇందులో మహేష్ బాబు సరసన క్రితి సానన్ హీరోయిన్‌గా నటిస్తోంది. 4 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మాతలు. జనవరి 10న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

గౌతం ఎంట్రీ

గౌతం ఎంట్రీ


‘1'(నేనొక్కడినే) చిత్రం ద్వారా మహేష్ వారసుడు గౌతం కృష్ణ బాలనటుడుగా వెండితెర తెరంగ్రేటం చేయబోతున్నాడు. ఇప్పటికే గౌతంపై పలు సీన్లను చిత్రీకరించారు. చిన్నతంలోని మహేష్ పాత్రలో గౌతం కనిపించనున్నాడు.

మహేష్ బాబు పాత్ర

మహేష్ బాబు పాత్ర


డిఫరెంట్ చిత్రాలకు పెట్టింది పేరైన దర్శకుడు సుకుమార్....చాలా కాలం పాటు స్క్రిప్టు వర్కు చేసి వైవిధ్యమైన అంశాలతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. వినోదంతో పాటు అన్నిరకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈచిత్రం ప్రేక్షకులను అలరించనుంది. ఈ చిత్రంలో మహేష్ బాబు రాక్ స్టార్‌గా కనిపించనున్నాడని తెలుస్తోంది.

తారాగణం

తారాగణం


సాయాషి షిండే, కెల్లీ దోర్జి, విక్రం సింగ్, శ్రీనివాస రెడ్డి, నాజర్, ప్రదీప్ రావత్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంలో ఆచంట రామ్, ఆచంట గోపీచంద్, అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

సాంకేతిక విభాగం

సాంకేతిక విభాగం


ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : రత్నవేలు, సంగీతం : దేవిశ్రీప్రసాద్, కళ : రాజీవన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఫర్వేజ్ ఫిరోజ్, కెచ్చా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కోటి పరుచూరి, నిర్మాతలు : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : సుకుమార్.

English summary

 Prince Mahesh Babu 1 Nenokkadine Movie Stills. Directed by Sukumar and Produced by 14 Reels Entertainment. Music by Devi Sri Prasad. Bollywood Model Kriti Sanon in female lead role.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu