హీరో చితకొట్టుడికి కొత్తపెళ్ళికొడుకు చతికిల పడ్డాడు...!?
బాలీవుడ్ కొరియోగ్రాఫర్ పోనీ వర్మతో మొన్న 25న ప్రకాష్ రాజ్ ద్వితీయ వివాహం జరిగిపోయిందంటూ మీడియా చాలా హడావిడి చేసింది కానీ నిజానికి అలాంటిదేం లేదు. అయితే మీడియా మాత్రం ప్రకాష్ రాజ్ ని కొత్త పెళ్ళికొడుకుగా బాగా ప్రమోట్ చేసేసింది. ఇక అసలు విషయానికొస్తే నిన్న మొన్నటి వరకూ తను నటిస్తూ, నిర్మాతగా వ్యవహరిస్తోన్న నాగార్జున చిత్రం 'గగనం"లో పాల్గొన్న ఈ కొత్త పెళ్ళికొడుకు ఇప్పుడు కొట్టించుకోవడానికి పుణె వెళ్ళాడు.
ప్రకాష్ రాజ్ ని కొట్టేదెవరా అని తొందరపడకండి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సింగనమల రమేష్ నిర్మాణంలో రూపొందుతున్న మహేష్ బాబు చిత్రంలో ప్రకాష్ రాజ్ విలన్ కనుక క్లైమాక్స్ ఫైట్ లో ప్రకాష్ రాజ్ ని చితగ్గొట్టబోతున్నాడు ప్రిన్స్ మహేష్. నిన్నటి వరకూ త్రివిక్రమ్ సినిమా కోసం పుణె రోడ్ల పైన ఛేజ్ లు చేసిన మహేష్ ఇవ్వాళ, రేపు రెస్ట్ తీసుకుని ఎల్లుండి నుంచీ క్లైమాక్స్ ఫైట్ చిత్రీకరణలో పాల్గొంటాడట. మహేష్, అనుష్క, ప్రకాష్ రాజ్, తనికెళ్ళభరణి, షఫీ, రావురమేష్ లపై రామ్ లక్ష్మణ్ ల ఆద్వర్యంలో జరిగే ఈ క్లైమాక్స్ చిత్రీకరణతో మహేష్ సినిమా పుణె షెడ్యూల్ పూర్తి అవుతుంది.


Click it and Unblock the Notifications











