ఆడియో ఫంక్షన్ కు మహేష్ గెస్ట్ గా ఖరారు
ఈ రోజుల్లో, బస్ స్టాప్ చిత్రాల కెమెరామెన్ జె.ప్రభాకర్‌రెడ్డి దర్శకత్వంలో 'ప్రేమ కథా చిత్రమ్' తయారవుతోంది. రీసెంట్ గా ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. మారుతీ టాకీస్ పతాకంపై తెరకెక్కనున్న ఈ చిత్రానికి జె.బి. సంగీతాన్ని అందించాడు. ఈ నెల 10న ఈ చిత్ర పాటలను.. మహేష్‌బాబు చేతుల మీదుగా ఘనంగా విడుదల చేసేందుకు యూనిట్ సన్నాహకాలు చేస్తోంది. ఈ రోజుల్లో, బస్టాప్ చిత్రాల దర్శకుడు మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.
ఈ చిత్రం కథ వివరిస్తూ దర్శకుడు....విచిత్రమైనది ప్రేమ. అనుభవిస్తే కానీ... అర్థం కాదు. అందరిలాగే ఆ కుర్రాడు కూడా ఓ అమ్మాయిని చూసి మనసుపడ్డాడు. పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయాడు. కానీ అవతలి నుంచే సరైన స్పందన రాలేదు. దీంతో ప్రేమలో ఓడిపోయానని తెలుసుకొన్నాడు. ఇక జీవితమే వద్దనుకొన్నాడు. ప్రాణాలు తీసుకొనేంతవరకూ వెళ్లిన ఆ కుర్రాడి జీవితంలో ఉన్నట్టుండి ఓ అనూహ్యమైన సంఘటన చోటు చేసుకొంది. అదేమిటో తెరపైనే చూడాలంటున్నారు జె.ప్రభాకర్‌రెడ్డి.
అలాగే ''ఓ అబ్బాయి, ఓ అమ్మాయి జీవితాల్లో జరిగిన అనూహ్య సంఘటనల సమాహారమే ఈ చిత్రం. ప్రేమలో ఓడిపోయిన ఆ ఇద్దరూ తీసుకొన్న నిర్ణయమేమిటన్నది ఆసక్తికరం. ప్రతి సన్నివేశం ఉత్కంఠభరితంగా సాగుతుంది. కథలో మలుపులు ప్రేక్షకుల్ని రక్తికట్టిస్తాయి. జె.బి.సమకూర్చిన స్వరాలు చిత్రానికి బలాన్నిస్తాయి''అన్నారు. ''నాలుగు పాత్రలతో తెరకెక్కిన చిత్రమిది. మేలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ''న్నారు నిర్మాతలు. సప్తగిరి, మారుతి, బిందు, విష్ణు ప్రియ, వెంకి తదితరులు నటించారు. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ: మారుతి.


Click it and Unblock the Notifications












