మహేష్ చేతుల మీదగా ‘బసంతి’ ట్రైలర్ (ఫోటోలు)
హైదరాబాద్ : రాజా గౌతమ్(బ్రహ్మానందం కుమారుడు), అలీషా బేగ్ జంటగా రూపొందుతున్న 'బసంతి' థియేటర్ ట్రైలర్‌ను హీరో మహేష్ బాబు ఆవిష్కరించారు. స్టార్ట్ కెమెరా పిక్చర్స్ పతాకంపై స్వీయ నిర్మాణంలో చైతన్య దంతులూరి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 'ఆగడు' సినిమా సెట్స్‌పై ఆన్‌లైన్ ద్వారా 'బసంతి' ట్రైలర్‌ను ఆవిష్కరించారు.
'బాణం' దర్శకుడు చైతన్య దంతులూరి దర్శకత్వంలో బ్రహ్మానందం కుమారుడు హీరోగా 'బసంతి' టైటిల్ తో ఓ చిత్రం రూపొందుతోంది. ట్రైలర్ర్ తో అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్న ఈ చిత్రం పై ట్రేడ్ లో అంచనాలు మొదలయ్యాయి. ఈ టైటిల్ కి A lovestory between a kite and a flight అనే ఇంట్రస్టింగ్ క్యాచీ లైన్ పెట్టారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
బాణం చిత్రానికి ముందే ఈ బసంతి చిత్ర కథ సిద్ధమైంది. సమాజంలో జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో నుంచి పుట్టిందే ఈ బసంతి కథ. కళాశాలలో అడ్మిషన్ తీసుకోగానే ప్రతి స్టూడెంట్‌కి ఒక గుర్తింపు వస్తుంది. అంతే కాదు కళాశాల బాధ్యతను కూడా గుర్తు చేస్తుంది. అందుకే కళాశాల జీవితం ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైనది. 'బసంతి కాలేజ్ ఆఫ్ ఆర్ట్‌స అండ్ సైన్స్'లో చదివే విద్యార్థుల కథే ఈ బసంతి. అర్జున్‌గా గౌతమ్ విద్యార్థి పాత్రలో కనిపిస్తాడు.
ఆవిష్కరణ ఫోటోలు స్లైడ్ షో లో ....

మహేష్‌బాబు మాట్లాడుతూ ....
హీరో గౌతమ్ ప్రామిసింగ్ హీరోగా ఉన్నాడని, ట్రైలర్ బాగా నచ్చిందని, యూనిట్‌లో ప్రతి సభ్యుడు విజయాన్ని అందుకోవాలని కోరుకున్నారు.

మహేష్ కంటిన్యూ చేస్తూ...
'ప్రచార చిత్రం ఆకట్టుకునేలా ఉంది. గౌతమ్ కొత్తగా కనిపించాడు. చిత్ర బృందానికి నా అభినందనలు'' అన్నారు

ప్లస్ అవుతుంది
మహేష్ బాబు లాంటి స్టార్ హీరో ఈ ట్రైలర్ ని లాంచ్ చేయటంలో అందరి దృష్టీ ఒక్కసారిగా ఈ చిత్రంపై పడింది. అది తప్పకుండా సినిమాకు క్రేజ్ పరంగా ప్లస్ అవుతుంది.

మంచి స్టాటజీ...
ఆన్ లైన్ లో ట్రైలర్ విడుదల చేయటం, దానికి ఓ పెద్ద దర్శకుడు, ఓ పెద్ద హీరో, హీరోయిన్ హాజరవటం అనేది ట్రైడ్ లో మంచి ఆసక్తి రేపుతోంది. సినిమాపై అంచనాలు రేపుతోంది.

శ్రీను వైట్ల మాట్లాడుతూ...
ఈ ట్రైలర్ బాగా నచ్చిందని, కథ సరికొత్తగా ఉందని తెలుస్తోందని, సాంకేతికంగా మంచి చిత్రంగా కనబడుతోందని దర్శకుడు శ్రీనువైట్ల అన్నారు. దర్శకుడు చైతన్య ఎంచుకొన్న కథ కొత్తగా ఉంది. సాంకేతికంగానూ ఈ సినిమా ఉన్నతస్థాయిలో ఉంటుంది అని చెప్పారు.

తణికెళ్ల భరిణి మాట్లాడుతూ...
ఈ చిత్రంలో తాను విలన్ షేడ్స్‌తో నటించానని, ఈ సినిమాలో తాను ఒక భాగమైనందుకు ఆనందంగా ఉందని తనికెళ్ల భరణి తెలిపారు.ఈ సినిమాలో నేను ఓ కీలక పాత్ర పోషించాను. ఇలాంటి ఓ మంచి చిత్రంలో నేను భాగం కావడం ఆనందంగా ఉంది అన్నారు.

గౌతమ్ మాట్లాడుతూ...
ఓ మంచి కథ బసంతి. దర్శకులు కథ చెబుతున్నప్పుడు ఎంతో ఆసక్తి కలగడంతోపాటు ఉద్వేగానికి లోనయ్యాను. నేను పోషిస్తున్న అర్జున్ పాత్ర నటుడిగా నిరూపించుకోవడానికి అవకాశముంది. గతంలో చేసిన చిత్రాలకూ ఈ చిత్రానికి వ్యత్యాసం ఉంది' అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ...
ఓ లక్ష్యమంటూ లేని కుర్రాడు. చదువుకొంటూ స్నేహితులతో సరదాగా గడుపుతుంటాడు. పనిలో పనిగా ఓ అమ్మాయిని చూసేసి మనసు పారేసుకొన్నాడు. ఆమె ప్రేమని పొందితే చాలనుకొంటుంటాడు. ఇంతలోనే ఆ ఇద్దరి జీవితంలో అనూహ్యంగా ఓ సంఘటన. దాని పర్యవసానాలేమిటి? వీరి ప్రేమకథకీ, విప్లవానికీ మధ్య సంబంధమేమిటి? తదితర విషయాల్ని తెరపైనే చూడాలంటున్నారు చైతన్య దంతులూరి.

వీరంతా...
ఈ కార్యక్రమంలో నిర్మాత, దర్శకుడు చైతన్య దంతులూరి, రాజాగౌతమ్, చిత్ర సహనిర్మాత వివేక్ కూచిభొట్ల, బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు.

తమన్నా మాట్లాడుతూ...
ఈ ట్రైలర్ చూస్తేనే ఉత్సాహంగా ఉందని, కథ సరికొత్తగా ఉండబోతోందని, సినిమా చూడాలన్న కుతూహలం కలుగుతోందని తమన్నా తెలిపారు.

తెర ముందు...వెనక
విద్యార్థి పాత్రలో గౌతమ్ కనిపించే ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో తనికెళ్ల భరణి, షాయాజీషిండే, రణధీర్ గట్ల, నవీన జాక్సన్, డా.కె.ఎస్.ఐ.ఆనంద్, ధన్‌రాజ్, మణి కిరణ్, భాను ఆవిర్నేని, దయ నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, పాటలు: కృష్ణ చైతన్య, శ్రీమణి, కెమెరా: అనీల్ భండారి, మాటలు: శ్రీకాంత్ విస్సా, నృత్యాలు: రఘు, ఆర్ట్: రఘు కులకర్ణి, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్, సహ నిర్మాత: వివేక్ కూచిబొట్ల, కథ, కధనం, నిర్మాత, దర్శకత్వం: చైతన్య


Click it and Unblock the Notifications











