మహేష్ బాబుతో రిబ్బన్ కట్టింగ్...జనమే జనం!
హైదరాబాద్ : సూపర్ స్టార్ మహేష్ బాబు గురువారం కూకట్ పల్లిలో కొత్తగా ఏర్పాటైన 'సౌతిండియా షాపింగ్ మాల్'ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ...హైదరాబాద్ లోనే ఇది పెద్ద షాపింగ్ మాల్ అని, వాళ్ల బిజినెస్ సక్సెస్ కావాలని విషెస్ తెలిపారు.
మహేష్ బాబు వస్తున్నాడని తెలియడంతో అక్కడికి భారీ సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. దీంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసారు. షాపింగ్ మాల్ మేయిన్ రోడ్ పైక్కనే ఉండటంతో జనం రాకతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. మహేష్ బాబుతో సౌతిండియా షాపింగ్ మాల్ అగ్రిమెంట్ 2 నుంచి 3 ఏళ్ల పాటు సాగనుంది.
ఇప్పటి వరకు ఏ తెలుగు హీరో కూడా మహేష్ బాబు రేంజిలో యాడ్ ఫిల్మ్స్ ద్వారా సంపాదించడం లేదు. ఇటు కమర్షియల్ యాడ్లలో...మరో వైపు సినిమాల్లో సూపర్ స్టార్‌గా కొనసాగుతూ చేతి నిండా సంపాదిస్తున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో నటిస్తున్నాడు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో వెంకటేష్ మరో హీరోగా నటిస్తున్నారు. మహేష్ సరసన సమంత, వెంకటేష్ సరసన అంజలి నటిస్తున్నారు.
వెంకీ-మహేష్ అన్నదమ్ముళ్లుగా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే టాలీవుడ్ లో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. అన్నదమ్ముల రిలేషన్ ఈ చిత్రంలో మెయిన్‌గా ఫోకస్ కానుంది. ఈ చిత్రం తర్వాత మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో మరో చిత్రం చేయబోతున్నారు. ఈచిత్రంలో క్రితి సానన్ హీరోయిన్ గా ఎంపికైంది.


Click it and Unblock the Notifications











