twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ బాబు లేజీ, ఎన్టీఆర్ క్రేజీ.. క్షమాపణలు చెప్పాల్సిందే.. ఆ సినిమాపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫైర్

    |

    ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య చిత్రం విడుదలై మంచి టాక్‌ను సంపాదించుకుంది. అయితే అందులోని కొన్ని సన్నివేశాలు మాత్రం మహేష్ బాబు అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించాయి. వెంటనే క్షమాపణలు చెప్పాలి, ఆ సీన్లను తొలగించాలని చిత్రయూనిట్‌కు హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. అసలింతకీ ఏం జరిగిందే ఓ సారి చూద్దాం.

    మంచి టాక్..

    మంచి టాక్..

    మలయాళీ రీమేక్ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు మార్పులు చేర్పులు చేయడంతో అందర్నీ మెప్పించింది. అయితే స్లోగా సాగుతుండటమేనది మాత్రం మైనస్ పాయింట్. మిగతా కథ, కథనాలు, పాత్రల పర్ఫామెన్స్ అదిరిపోయిందని అంటున్నారు. అయితే కొన్ని సీన్లు మాత్రం మహేష్ బాబు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెడుతున్నాయి.

    అలాంటి సీన్స్..

    అలాంటి సీన్స్..

    ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య' చిత్రంలో సుహాస్ కూడా కీలక పాత్ర పోషించాడు. అతడు తను ప్రేమించే అమ్మాయి ఇద్దరూ తెలుగు హీరోల ఫ్యాన్స్. అందులో అమ్మాయి మహేష్ బాబు ఫ్యాన్. సుహాస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. మాటల మధ్యలో వీరిద్దరూ మాట్లాడుకుంటూ.. ‘మహేష్ బాబు అయితే ఉన్న చోట నుండీ కదలకుండా చంపేస్తూ ఉంటాడు- ‘వెరీ లేజీ', అదే ఎన్టీఆర్ అనుకో వెంబడి పడి పడి నరికేస్తుంటాడు-‘సో క్రేజీ' అంటూ ఓ డైలాగ్ చెబుతాడు.

    మహేష్ బాబు లేజీ..

    మహేష్ బాబు లేజీ..

    ఇలా మహేష్ బాబుని ‘లేజీ' అన్నందుకు డైరెక్టర్ వెంకటేష్ మహా, హీరో సత్యదేవ్‌లపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. వెంటనే ఆ సీన్‌ను డిలీట్ చేయండి లేదా, డైరెక్టర్ క్షమాపణలు చెప్పండని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇక ఇదే డైలాగ్‌ను పట్టుకుని ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు.

    నెగెటివ్ టాక్‌ను..

    నెగెటివ్ టాక్‌ను..

    మరో సీన్‌లో ఎన్టీఆర్ ఫ్యాన్ అయిన సుహాస్.. మహేష్ బాబు సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తాడు. నువ్ ఎన్టీఆర్ ఫ్యాన్ కదా మహేష్ సినిమాకు ఎందుకు వచ్చావ్ అని ఆ అమ్మాయి అడగ్గా టాక్ ఎలా ఉందో బయటకు చెప్పేద్దామని, అందుకే ఇలా వచ్చానని చెబుతాడు. మీ ఎన్టీఆర్ సినిమా విడుదలైనప్పుడు మీ సంగతి చెబుతానని ఆ అమ్మాయి అంటుంది.

    Recommended Video

    Checkmate Movie Trailer | Anchor Vishnupriya చెక్ మేట్ ట్రైలర్, విష్ణుప్రియ యమ హాట్ గురూ !
    సోషల్ మీడియాలో ట్రెండ్..

    సోషల్ మీడియాలో ట్రెండ్..

    ఇలా మహేష్ బాబు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఒకరినొకరు దూషించుకుంటున్నారు. డూప్ లేకుండా ఎన్నో స్టంట్‌లు చేస్తాడని అప్పుడెప్పుడో కృష్ణ చెప్పిన మాటలను ఇప్పుడు ట్రెండ్ చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో #UMURteamShouldApologizeMaheshBabu అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.

    English summary
    UMUR Create Row Between Mahesh Babu And NTR Fans. Mahesh fans are demanding apology from Uma Maheshwara Ugra Roopasya aka UMUR makers for calling Mahesh as lazy. There are couple of scenes in Uma Maheshwara Ugra Roopasya which doesn’t go well with Mahesh Babu fans.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X