దుబాయ్ వెళ్లిన మహేష్ బాబు
హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' షూటింగ్ ముగియగానే ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెకేషన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే తన పాత్రకు డబ్బింగ్ వర్క్ పెండింగ్ ఉండటంతో.... ఆ పని పూర్తి చేయడానికి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్.... డిసెంబర్ 31న డబ్బింగ్ వర్క్ పూర్తి చేసి తిరిగి మళ్లీ దుబాయ్ వెళ్లి పోయారు.
మరో వారం రోజుల పాటు అక్కడే గడిపి జనవరి 9లోపు హైదరాబాద్ చేరుకోనున్నారు. సంక్రాంతి సీజన్లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు విడుదల ఉండటంతో ఆ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్లలో పాల్గొంటారు. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత మళ్లీ తిరిగి సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం షూటింగులో జాయిన్ అవుతారు.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్‌పై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో పూర్తి కుటుంబ కథా చిత్రంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. వెంకటేష్ సరసన జర్నీ ఫేం అంజలి మరో హీరోయిన్ రోల్ చేసింది. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో ఈచిత్రాన్ని తెరక్కిస్తున్నారు. రోహిణి, రావు రమేష్, ఆహుతి ప్రసాద్, బ్రహ్మానందం, రమా ప్రభ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కె.వి.గుహన్, సంగీతం: మిక్కీ జే మేయర్, సహనిర్మాతలు: శిరీష్-లక్ష్మణ్, పాటలు: సిరి వెన్నెల సీతారామశాస్త్రి.


Click it and Unblock the Notifications











