మహేష్ బాబు ‘ఆగలేదు’, మళ్లీ ఫ్యామిలీతో....
హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు సినిమా షూటింగులు, ఫ్యామిలీ, ఎండార్స్ మెంట్లు తప్ప వేరే ప్రపంచం తెలియదు. అందుకే సినిమా షూటింగులు ముగిసిన వెంటనే వీలు చూసుకుని ఫ్యామిలీతో కలిసి ప్రపంచ దేశాలు చుట్టి వస్తుంటారు. ఎప్పటిలాగే ‘ఆగడు' సినిమా తర్వాత కూడా మహేష్ బాబు వెకేషన్ వెళ్లారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు బ్యాంకాక్ వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడి నుండి మలేషియా సందర్శిస్తారని తెలుస్తోంది. ఇండియా వచ్చిన తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో జరిగే షూటింగులో పాల్గొంటారని తెలుస్తోంది. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన శృతి హాసన్ హీరోయిన్.

ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, జగపతి బాబు, బ్రహ్మానందం, ముఖేష్ రిషి, సంపత్, సుబ్బరాజు, తులసి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: మధి, స్టిల్స్: అనల్ అరసు, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్, మేకప్: పట్టాబి, కాస్ట్యూమ్స్: రాజు, స్టిల్స్: దాసు, చీఫ్ కో-డైరెక్టర్: పి.వి.వి.సోమరాజు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: కె.వి.వి.బాలసుబ్రహ్మణ్యం, ప్రొడక్షన్ మేనేజర్ బి.వి.రామిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్ కుమార్ రాజు.ఎం.చంద్రశేఖర్ రావిపాటి. నిర్మాతలు: ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశకర్, సి.వి.మోహన్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: కొరటాల శివ.


Click it and Unblock the Notifications











