twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'జల్లికట్టు' ఉద్యమానికి మహేష్ బాబు మద్దతుగా ఇలా...

    జల్లికట్టు ఉద్యమానికి మహేష్ బాబు మద్దతు ప్రకటించారు.

    By Srikanya
    |

    చెన్నై: తమిళనాట..జల్లికట్టు వివాదంపై పెద్ద ఉద్యమం జరుగుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఎన్నో మహోద్యమాలు తలెత్తినప్పటికీ అన్నింటినీ తలదన్నేలా విప్లవ జ్వాలలతో రగిలిపోతూ తమిళుల గళాన్ని కేంద్రం వరకు వినిపిస్తున్నారు. ప్రపంచమంతా తమ వైపు తిరిగి చూసేలా చేశారు. అదే జల్లికట్టుపై పొంగుతున్న యువ చైతన్యం. సాంకేతిక అభివృద్ధితో అందుబాటులోకి వచ్చిన సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల వేదికగా ప్రారంభమైన ఉద్యమం ఇది.

    జల్లికట్టు ఆందోళనలు వెనుక రాజకీయాలు లేవు, నిరసనకారుల ముందు నాయకులూ లేరు. ఉన్నదంతా ఒకటే... అదే తమిళ సంస్కృతి. ప్రాచీనకాలం నుంచి నిర్వహించే జల్లికట్టును తమిళ సంస్కృతికి ప్రతీకగా భావించి, ప్రస్తుతం ఆ క్రీడపై నిషేధాన్ని తమిళుల సంస్కృతిపై జరుగుతున్న దాడిగా పరిగణించడమే ఈ ఉద్ధృత ఆందోళనలకు కారణమైంది. అదే తమిళులను సంఘటితం చేసి ఒకే మార్గంలో నడిపించేలా చేసింది. ఈ నేపధ్యంలో సినిమావారంతా తమ సపోర్ట్ ని జల్లికట్టుకు ప్రకటిస్తున్నారు. తాజాగా తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ట్విట్టర్ ద్వారా తమ మద్దతును ప్రకటించారు.

    ముఖ్యంగా తమిళనాట స్టూడెంట్స్ అంతా ఒక కారణం కోసం సంఘటితమవటం మెచ్చుతగినది అంటూ ఆయన ట్వీట్ చేసారు.

    తమిళనాడులో సంఘటితంగా జరుగుతున్న ఈ ఉద్యమానికి ఆయన సపోర్ట్ చేస్తూ వరస ట్వీట్స్ చేసారు.

    జల్లికట్టు...తమిళన వారి ధైర్యానికి ప్రతీక , స్పిరిట్ అంటూ ట్వీట్ చేసారు.

    మెరీనా తీరంలో గురువారం జరిగిన ఆందోళనలో సినీ నటులు కార్తి, ఉదయ, దర్శకుడు గౌతమన్‌, శరత్‌బాబు తదితరులు పాల్గొన్నారు. నటుడు కార్తి వచ్చిన సమయంలో కొందరు యువకులు కరతాళధ్వనులతో హర్షం ప్రకటించగా మరికొందరు వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఆందోళనలో పాల్గొనడానికి వస్తున్న అందరూ సమానులేనని, అందువలన ఇలాంటి చర్యలకు పాల్పడకూడదని హెచ్చరించడంతో తమ చర్యలను యువకులు మానుకున్నారు. అలాగే నటుడు సత్యరాజ్‌ కూడా ఆందోళనలో పాల్గొన్నారు.

    సత్యరాజ్ మాట్లాడుతూ... ఎలాంటి సంస్థ, నాయకుడు లేకుండా సామాజిక మాధ్యమాల ద్వారా విద్యార్థులు సంఘటితం కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని తెలిపారు. వారి ఆందోళన సఫలమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కొద్దిసేపు ఆందోళనలో కూర్చున్న సినీ ప్రముఖులు ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. వారితో ఫొటోలు, సెల్ఫీలకు యూత్ దూరంగా ఉండటం గమనార్హం.

    మరో ప్రక్క తమిళనాట జల్లికట్టుకు మద్దతుగా యువత చేపడుతున్న పోరాటం నానాటికీ ఉద్ధృతమవుతూండటంతో.... దీంతో సినీ పరిశ్రమలోని అన్ని భాగాలు ఈ ఆందోళనకు మద్దతు ప్రకటిస్తున్నాయి. అందులో భాగంగా థియేటర్‌ యజమానుల సంఘం కూడా సంఘీభావం ప్రకటించింది.

    జల్లికట్టుకు మద్దతుగా శుక్రవారం షోలను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు థియేటర్‌ యజమానుల సంఘం అధ్యక్షుడు అభిరామి రామనాథన్‌ గురువారం ప్రకటన విడుదల చేశారు. ఇదిలా ఉండగా గురువారం జరగాల్సిన కొన్ని ఆడియో విడుదల కార్యక్రమాలను కూడా రద్దు చేశారు.

    English summary
    Super Star Mahesh Babu tweeted about the popular Jallikattu movement of Tamilnadu. he tweeted, "#Jallikattu is the spirit of Tamil Nadu - bold and fearless. Proud to see such a statement of unity among Tamilians for something that they truly believe in. Especially admire the way the students of Tamil Nadu have been standing up for the cause, relentlessly fighting for their roots and culture. Hope their voices are heard. I support the spirit of Tamil Nadu. #JusticeforJallikattu"
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X