పవన్ స్కీమ్ నే మహేష్‌ సైతం...

By Srikanya

Mahesh Babu likely to croon for 'Aagadu'
హైదరాబాద్: సినిమా ప్రారంభరోజుల్లో మాటలుతో పాటు, పాటలు కూడా హీరోలే పాడేవారు. తర్వాత హీరోలు కి పాడటానికి గాయకులు వచ్చారు. అయితే అప్పుడప్పుడూ క్రేజ్ కోసం మన హీరోలు, హీరోయిన్స్ గొంతు సవరించుకోవడం కొత్తేమీ కాదు. దర్శకుడో, సంగీత దర్శకుడో కాస్త బలవంతం చేస్తే చాలు... వచ్చి మైకు ముందు నిలుచుంటారు.

ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ ... అత్తారింటికి దారేది చిత్రం కోసం కాటమరాయుడా పాటను ఆలపించారు. ఆ పాట పెద్ద హిట్టైంది. సినిమా ప్రమోషన్ కి సైతం పాట ప్లస్ అయ్యింది. ఇప్పుడు అదే రూటులో మహేష్ సైతం ప్రయాణం పెట్టుకున్నారు. హీరో ఆలపించిన ఆ పాట గురించి, సినిమా గురించి జనాలు పదే పదే చర్చించుకొంటుంటారు. అది సినిమాకి చాలా రకాలుగా మేలు చేస్తుందని భావించి ఆయనచేత పాడించటానికి దర్శక,నిర్మాతలు నిర్ణయించారు.

ఇదివరకు మహేష్‌బాబు 'బిజినెస్‌మేన్‌' కోసం దర్శకుడు పూరి జగన్నాథ్‌తో కలిసి ఓ పాట పాడారు. తమన్‌ స్వరకల్పనలో వచ్చిన ఆ పాట చక్కటి స్పందన లభించింది. తాజాగా మరోసారి మహేష్‌బాబుతో పాట పాడించాలని నిర్ణయించుకున్నారు తమన్‌. ఆ విషయాన్ని సంగీత దర్శకుడు తమన్‌ ధృవీకరించారు.

శ్రీనువైట్ల దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా 'ఆగడు' సినిమా తెరకెక్కుతోంది. ఇందులో మహేష్‌బాబుతో ఓ పాట పాడించేందుకు రంగం సిద్ధమైంది. ఆయన మీడియాతో మాట్లాడుతూ ''మహేష్‌ 'ఆగడు' కోసం ఓ పాట పాడుతున్నారు. ప్రస్తుతం ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాం'' అన్నారు.

ఈ చిత్రంలో మహేష్ తొలిసారిగా రాయలసీమ యాస మాట్లాడుతూ తుపాకీ ఎక్కుపెట్టబోతున్నారు. 'ఆగడు'లో ఆయన ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా నటిస్తున్నట్టు సమాచారం. మహేష్‌, తమన్నా జంటగా నటిస్తున్న చిత్రమిది. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ సాగుతోంది.

'దూకుడు' తర్వాత మహేష్‌, శ్రీను వైట్ల కలయికలో రూపొందుతున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాల్ని అందుకొనేలా 'ఆగడు'ని రూపొందిస్తున్నట్టు సినిమావర్గాలు చెబుతున్నాయి. మహేష్‌ శైలి వినోదం, యాక్షన్‌ అంశాల మేళవింపుతో సాగే ఈ చిత్రం ఇంటిల్లిపాదినీ అలరించేలా ఉంటుందని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. దసరా కానుకగా సెప్టెంబర్ 26న సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇంతకాలం శ్రీను వైట్లతో కలిసి పని చేసిన గోపీ మోహన్, కోన వెంకట్ సొంతగా దర్శకత్వం వైపు అడుగులు వేయడంతో.... 'ఆగడు' సినిమాకు సొంతగా స్క్రిప్టు రాసుకుని దిగారు శ్రీను వైట్ల. 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్ బేనర్లో 'దూకుడు' సినిమా చేసిన మహేష్ బాబు.....అదే బానర్లో సుకుమార్ దర్శకత్వంలో సినిమాకు చేసారు. ఆ సినిమా వెంటనే మళ్లీ ఇదే బేనర్లో శ్రీను వైట్లతో 'ఆగడు' సినిమా చేయడానికి రెడీ కావడం గమనార్హం. ఖచ్చితంగా మరో హిట్ తో వస్తామని శ్రీను వైట్ల,నిర్మాతలు పూర్తి నమ్మకంగా ఉన్నారు. సంగీతం: తమన్‌, ఛాయాగ్రహణం: కె.వి. గుహన్‌, కళ: ఎ.ఎస్‌.ప్రకాశ్‌, కూర్పు: ఎం.ఆర్‌.వర్మ, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: పరుచూరి కోటి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X