మహేష్ మెచ్చిన తమిళ్ సినిమా.. తెలుగులో రీమేక్ చేసేదెవరు?
సాధారణంగా మహేష్ బాబు ఎవరిదైనా సినిమా నచ్చితే ఎవరు చెప్పకపోయినా కూడా ట్విట్టర్ లో సొంత నిర్ణయంతో ప్రమోషన్స్ డోస్ పెంచుతాడు. గతంలో చాలా సినిమాలపై సూపర్ స్టార్ పాజిటివ్ గా స్పంధించిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల ఒక తమిళ్ మూవీ కూడా నచ్చడంతో వెంటనే ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టాడు.
ప్రస్తుతం షూటింగ్స్ లేకపోవడంతో మహేష్ ఇంట్లోనే ఉంటూ వివిధ రకాల సినిమాలు వెబ్ సిరీస్ లను చూస్తున్నాడట. మొన్న ఆ మధ్య డార్క్ వెబ్ సిరీస్ పై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ఇక రీసెంట్ గా 'ఓ మై కడవులే' అనే సినిమపై కూడా ప్రశంసలు కురిపించాడు. సినిమా చాలా బాగుంది. నటీనటుల యాక్టింగ్ అలాగే డైరెక్టర్ పనితనం కూడా అద్భుతంగా ఉందని ట్వీట్ చేయడంతో ఒక్కసారిగా ఆ సినిమాపై తెలుగులో కూడా బజ్ మొదలైంది.

అయితే ఇదివరకే ఆ వినిమా తెలుగు రీమేక్ రైట్స్ ని పీవీపీ నిర్మాణ సంస్థ దక్కించుకుంది. మొదట ఈ రీమేక్ లో అక్కినేని అఖిల్ నటించనున్నట్లు టాక్ వచ్చినప్పటికీ అవన్నీ పుకార్లని తేలింది. ఇక ఇప్పుడు మరికొంత మంది పేర్లు వినిపిస్తున్నాయి. ఆ క్యూట్ లవ్ స్టోరీలో నాగ చైతన్య, లేదా నితిన్ నటించే ఛాన్స్ ఉందని రూమర్స్ వస్తున్నాయి. ఇక ఈ విషయంలో క్లారిటీ రావాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











