లండన్‌లో మకాం వేయబోతున్న మహేష్ బాబు

By Bojja Kumar

హైదరాబాద్ : సూపర్ స్టార్ మహేష్ బాబు లండన్‌‌లో నెల రోజులకు పైగా మకాం వేయబోతున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు దర్శకుడు సుకుమార్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం నెక్ట్స్ షెడ్యూల్ లండన్లో ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 40 రోజుల పాటు అక్కడే షూటింగ్ జరుగనున్నట్లు తెలుస్తోంది. అక్కడ పలు కీలక సీన్లు చిత్రీకరించనున్నారు. త్వరలో ఈ షూటింగ్ షెడ్యూల్ డేట్స్ ఖరారు కానున్నాయి.

ఈ చిత్రంలో క్రితి సానన్ హారోయిన్ గా చేస్తోంది. మహేష్‌తో 'దూకుడు' చిత్రాన్ని నిర్మించిన 14రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి తాజాగా అందిన ఆసక్తికర సమాచారం ఏమిటంటే....బాలీవుడ్ మూవీ 'ఏక్ థా టైగర్'కు అద్భుతమైన ఫైట్స్ కంపోజ్ చేసిన హాలీవుడ్ ఫైట్ మాస్టర్ కాన్రాడ్ పాల్మిశానో 'మహేష్ బాబు-సుకుమార్' సినిమాకు పని చేయబోతున్నారు.

సుకుమార్ తయారుచేసిన స్క్రిప్ట్ మహేష్‌ బాబుని బాగా ఇంప్రెస్ చేసిందని, ముఖ్యంగా ఆయన క్యారెక్టరైజేషన్ పూర్తి వైవిధ్యంగా వుండేలా సబ్జెక్ట్‌ను సుకుమార్ తీర్చిదిద్దాడని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రం కోసం మహేష్ బాబు కొత్త లుక్ తో చూపెట్టనున్నారు.

ఈ చిత్రంలో షాయాజీ షిండే, కిల్లి దోర్జీ, విక్రమ్ సింగ్, శ్రీనివాస్ రెడ్డి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సాంకేతిక వివరాల్లోకి వెళితే... ఈ చిత్రానినికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: ఆర్ రత్నవేలు, స్టూడియో: 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ -స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుకుమార్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X