కొడుకు లుక్కులో మహేష్.. గౌతమ్ మాదిరిగానే.. ఆ లుక్ అలా ఉంది మరి

సాధారణంగా తండ్రి పొలికలతోనే కొడుకు పెరుగుతూ ఉంటాడు. ఒక వయసుకు వచ్చే వరకు పొలికలు చాలా వరకు మ్యాచ్ అవుతాయి. అయితే ఇప్పుడు మహేష్ బాబు మాత్రం కొడుకు మాదిరిగా కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. గౌతమ్ కు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో చాలానే వైరల్ అవుతున్నాయి. కొన్ని రోజులైతే ఇద్దరిని ఒక సైడ్ నుంచి చూస్తే మహేష్ ఎవరు గౌతమ్ ఎవరు అనేలా కన్ఫ్యూజ్ అవ్వడం కాయమని కామెంట్స్ కూడా వస్తున్నాయి.

ఎంత బిజీగా ఉన్నా..

ఎంత బిజీగా ఉన్నా..

మహేష్ బాబు ఫ్యామిలీ మ్యాన్ అని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. వీలైనంత వరకు ఏ మాత్రం గ్యాప్ దొరికినా కూడా కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు ఎగిరిపోతాడు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి తగిన సమయాన్ని కేటాయిస్తారు. ఖాళీ సమయాల్లో ఇంట్లో ఉంటాడు. లేదా ఫ్యామిలీతో బయటకు వెళ్లిపోతాడు మహేష్.

అభిమానుల్లో కన్ఫ్యూజన్

అభిమానుల్లో కన్ఫ్యూజన్

ఇక మహేష్ కొడుకు రోజురోజుకు చాలానే ఎదుగుతున్నాడు. ఒక వారం ముందు చూసిన ఫొటోకు ఇప్పుడు చూసిన ఫొటోకు అస్సలు మ్యాచ్ అవ్వడం లేదు. అభిమానుల్లో ఒక కన్ఫ్యూజన్ మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గౌతమ్ తండ్రిలా అవుతున్నాడా.. లేక మహేష్ బాబే తన కొడుకులా అవుతున్నాడా అనే కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఒక్క క్షణం గౌతమ్ అనుకున్నారు

ఒక్క క్షణం గౌతమ్ అనుకున్నారు

ఇటీవల ఇన్స్టాగ్రామ్ లో సితార పోస్ట్ చేసిన ఒక ఫోటోలో ఎవరు ఊహించని విధంగా షాక్ ఇచ్చాడు మహేష్. ఒక్క క్షణం గౌతమ్ అని అనుకున్నారు నెటిజన్లు. మహేష్ ఇటీవల దుబాయ్ వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ సితారతో షాపింగ్ చేస్తున్నప్పుడు మస్కులో ఉన్నది గౌతమ్ అనే అనుకున్నారు అందరు. హెయిర్ స్టైల్ తో పాటు గాగుల్స్ పెట్టుకోవడం కూడా అనుమానాలకు బలాన్ని ఇచ్చింది.

ముసుగు తీస్తే మహేష్ కనిపిస్తాడు

ముసుగు తీస్తే మహేష్ కనిపిస్తాడు

ఇక సితార ఆ విషయంలో క్లారిటీ ఇచ్చేసింది. నాన్నతో షాపింగ్ అనే క్యాప్షన్ ఇస్తూ.. ఎప్పుడు తిరిగినా కూడా నన్ను జాగ్రత్తగా చూసుకుంటారని చెప్పడంతో ఆయన మహేష్ అని తేలిపోయింది. గౌతమ్ లాగానే షాట్ వేసుకున్నారు. ముసుగుతో పాటు గాగుల్స్ తీస్తే మహేష్ బాబు బయటకు వస్తారని కామెంట్ చేస్తున్న అభిమానులు.. తండ్రి కొడుకుల ఫొటోలను ఒక ఫ్రేమ్ లో యాడ్ చేసి మరింత వైరల్ అయ్యేలా చేస్తున్నారు.

Recommended Video

Super Star Mahesh Babu Financial Assistance To 2 Kids Heart Surgery | Filmibeat Telugu
అందుకు కారణం..

అందుకు కారణం..

ఇక మహేష్ అలా కనిపించడానికి కారణం సర్కారు వారి పాట లుక్ అనే చెప్పాలి. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కక్నున్న ఆ సినిమాలో మహేష్ సరికొత్త లుక్ తో కనిపించనున్నాడు. షూటింగ్ ఎప్పుడైనా స్టార్ట్ కావచ్చని గత నాలుగైదు నెలలుగా అదే లుక్కును మెయింటైన్ చేస్తున్నాడు. ఇక దాదాపు గౌతమ్ కూడా అదే లుక్కుతో ఉంటాడు కాబట్టి ఒక సైడ్ నుంచి గౌతమ్ అనుకోని కన్ఫ్యూజ్ అవుతున్నారు జనాలు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X