హీరో మహేష్ బాబు లగ్జరీ లైఫ్..!(ఫోటో ఫీచర్)
హైదరాబాద్ : సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ బ్రహ్మాండంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఇటీవల పలు సందర్భాల్లో మహేష్ బాబు కూడా స్వయంగా చెప్పారు కూడా. కెరీర్ బ్రహ్మాండంగా సాగుతుందంటే అదాయం కూడా అదే రేంజిలో ఉంటుంది. మహేష్ బాబు టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరు. ఒక రకంగా నెం.1 స్థానికి అటు ఇటు అని చెప్పవచ్చు.
ఆయన రెమ్యూనరేషన్ ఒక్కో సినిమాకు రూ. 10 నుంచి 15 కోట్ల మధ్యలో ఉంటుందని టాక్. ఇవి కాక రికార్డు స్థాయిలో వివిధ కార్పొరేట్ బ్రాండ్లకు అంబాసిడర్ గా కొనసాగుతున్నారు. ఈ లెక్క ప్రకారం ఆయన సంవత్సర ఆదాయం ఎన్ని కోట్లు ఉంటుందో ఇట్టే ఊహించుకోవచ్చు. ఈ రేంజిలో సంపాదన ఉన్నప్పుడు ఆటో మేటిక్ గా వారి లైఫ్ లగ్జరీగా సాగుతుందనేది కొత్తగా చెప్పాల్సిన పని లేదు.

మహేష్ బాబు

మహేష్ బాబు ఖరీదైన కొత్త స్టోర్ట్స్ కారు జాగ్వార్ ఎక్స్ఎఫ్. కారు పక్కనే మహేష్ బాబు ఉపయోగించే కారావాన్

మహేష్ బాబు కోసం కొత్తగా డిజైన్ చేయించిన కారావాన్లో అత్యాధునిక సౌకర్యాలు.

మహేష్ బాబు కోసం కొత్తగా డిజైన్ చేయించిన కారావాన్లో బెడ్ రూం.
మహేష్ బాబుతో పాటు ఇతర హీరోలు కూడా ఇదే విధంగా లగ్జరీ లైఫ్ గడుపుతుండవచ్చేమో గానీ....టాలీవుడ్లో ఈ మధ్య లగ్జరీ లైఫ్ గడుపుతున్న హీరోగా బాగా ఎక్స్ ఫోజ్ అవుతుంది మాత్రం ఈ సూపర్ స్టారే. తరచూ కొత్త కార్లు కొంటూ వార్తల్లో నిలిచే మహేష్ బాబు తాజాగా మరో ఖరీదైన స్టోర్ట్స్ కార్ కొన్నట్లు తెలుస్తోంది 'జాగుర్ ఎక్స్ ఎఫ్' అనే కంపెనీకి చెందిన ఈ కారు విలువ దాదాపు రూ. 50 లక్షలు నుంచి కోటి మధ్యలో ఉంటుందని అంచనా.
ఇదే కాక మహేష్ బాబు షూటింగు ఔట్ డోర్ స్పాట్లకు వెళ్లినప్పుడు బయ చేయడానికి ప్రత్యేకమైన కారావాన్(బస్సులాంటి వాహనంలో బెడ్ రూం, బాత్రూం, వంట రూం లాంటి సౌకర్యాలు) ను డిజైన్ చేయించారు. ఇందులో అత్యాధునికమైన బెడ్రూం, బాత్రూం, వంటరూం, పది మంది వరకు కూర్చుని మాట్లాడుకునే హాలు, టీవీ, ఇంటర్నెట్ లాంటి సౌర్యాలు ఉన్నాయి. వాటిని చూస్తుంటే కొన్ని లక్షలు ఖర్చు చేసి దీన్ని తయారు చేయించినట్లు స్పష్టం అవుతోంది.


Click it and Unblock the Notifications











