మేకప్‌మేన్ కోసం ఒప్పుకున్న మహేష్ బాబు
ఓ వైపు షూటింగులు, మరో వైపు వ్యాపార ప్రకటనల చిత్రీకరణల్లో పాల్గొంటూ బిజీగా ఉండే మహేష్ తను పిలవగానే రావడానికి ఒప్పుకోవడంపై పట్టాభి ఆనందంతో పొంగిపోతున్నాడట. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి సింగపూర్ వెళ్లిన మహేష్ బాబు తిరిగి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాడు.
ఎండలు తగ్గే వరకు మహేష్ ఫ్యామిలీతో సింగపూర్లోనే గడుపుతారని తెలుస్తోంది. ఆయన తిరిగి వచ్చిన తర్వాత సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో పాల్గొననున్నాడు. ఆతర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందబోయే 'ఆగడు' షూటింగులో జాయిన్ కానున్నాడు.
సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాతో పాటు, శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందబోయే 'ఆగడు' చిత్రాన్ని కూడా 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్ సంస్థపై అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో క్రితి సానన్ హీరోయిన్. అయితే ఆగడు చిత్రానికి ఇంకా హీరోయిన్ ఎవరనేది నిర్ణయించలేదని దర్శకుడు శ్రీను వైట్ల స్పష్టం చేసారు.


Click it and Unblock the Notifications












