బాలీవుడ్ దర్శక ద్వయంతో మహేష్ బాబు సినిమా?
హైదరాబాద్ : బాలీవుడ్ దర్శక ద్వయం రాజ్ నిడియోర్, కృష్ణ డీకెలతో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా చేయబోతున్నారా? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మహేష్ బాబు నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తేగానీ ఈ ప్రాజెక్టు ఓకే అవకాశం కనిపించడం లేదు.
కృష్ణ డీకె ఈ విషయమై స్పందిస్తూ...'మేము మహేష్ బాబుతో స్ట్రైట్ తెలుగు సినిమా చేయాలనే ప్లాన్లో ఉన్నాం. ఇప్పటికే మహేష్ బాబుకు స్టోరీ కూడా వివరించాం. ఆయన గ్రీన్ సిగ్నల్, డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తాము' అని వెల్లడించారు.
మహేష్ బాబుతోనే ఎందుకు చేయాలనుకుంటున్నారు అనే ప్రశ్నకు కృష్ణ స్పందిస్తూ....'మహేష్ బాబుతో ఎందుకు చేయకూడదు? ఆయన ఒక గ్రేట్ యాక్టర్. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి. అలాంటి యాక్టర్‌తో డిఫరెంట్ కమర్షియల్ సినిమా చేయాలనేదే మా ఉద్దేశ్యం' అన్నారు.
ఈ దర్శక ద్వయం ఇటీవల బాలీవుడ్లో 'గో గోవా గాన్' అనే చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాకు బాక్సాఫీసు వద్ద మంచి రెస్పాన్స్ వస్తోంది. అంతకు ముందు వీరు 2011లో షోర్ ఇన్ ది సిటీ, 2009లో '99' అనే , 2003లో 'ఫ్లేవర్స్' అనే చిత్రానికి దర్వకత్వం వహించారు. తెలుగులో నిర్మాతలుగా 'డి ఫర్ దోపిడి' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
మహేష్ బాబు ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈచిత్రం తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో 'ఆగడు' అనే సినిమాకు కూడా కమిట్ అయ్యారు.


Click it and Unblock the Notifications












