నేను ఇడియట్ ను కాను నా 'ఖలేజా' ఏంటో చూపిస్తాను: మహేష్ బాబు
అక్టోబర్ 7 నుంచి తన 'ఖలేజా" చూపించి సెన్సేషన్ సృష్టించబోతున్న ప్రిన్స్ మహేష్ దానికంటే ముందే ఓ సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. విషయం ఏమిటంటే..బాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'త్రీ ఇడియట్స్"ని మహేష్ హీరోగా శంకర్ తెలుగులోకి రీమేక్ చేస్తున్నారంటూ వార్తలొచ్చిన విషయం విదితమే. మహేష్ హీరో అనీ, ఇలియానా హీరోయిన్ అనీ, త్వరలోనే షూటింగ్ స్టార్ట్ అనీ పలు కథనాలు వినిపిస్తూ వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ఆలోచనలో పడేసింది.
'త్రీ ఇడియట్స్" పెద్ద హిట్ సినిమానే అయినప్పటికీ, శంకర్ లాంటి డైరెక్టర్ తో కలిసి ఈ సినిమా కోసం వర్క్ చేసే ఛాన్స్ వున్నప్పటికీ మహేష్ మాత్రం ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలనే సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నారనేది ప్లాష్ న్యూస్. అయితే 'రోబో" రిపోర్ట్ విని మహేష్ మనుసు మర్చుకున్నాడనో లేక 'రోబో" రిజల్ట్ పై 'త్రీ ఇడియట్స్" డిపెండ్ అయి వుందనో మీరేమాత్రం సందేహించక్కర్లేదు. ఎందుకంటే ఈ అంశం నెలన్నర నుండి చర్చల్లో వుందని సమాచారం. అయితే ఈ రోజే 'త్రీ ఇడియట్స్" చెయ్యాల్సిన స్లాట్ లో మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ చేసేందుకు ఇంకో రేర్ కాంబినేషన్ ని కూడా మహేష్ సెలక్ట్ చేసుకున్నారట. దాంతో ఇక మహేష్ 'త్రీ ఇడియట్స్" చెయ్యనట్టేనని విశ్వసనీయ సమాచారం.


Click it and Unblock the Notifications











