అందుకే మీడియా దూరం:మహేష్
మహేష్ బాబు మీడియాకు దూరంగా ఉండడం అందరికీ తెలిసిందే. అయితే థమ్సప్ పుణ్యమా అని ఆయన ఇపుడు మళ్లీ మీడియాకు దగ్గరయ్యారు. మనుసులోని మాట చెబుతున్నారు. ఇంతకు ఇన్నాళ్లు మీడియాకు ఎందుకు దూరంగా ఉన్నట్టు అంటే ఆయనే మొన్న ఒక పత్రికతో అసలు విషయం చెప్పారు. మీడియాలో తన గురించి సంబంధంలేని వార్తలు రావడం తనను ఇబ్బంది పెట్టిందని అందుకే అప్పటినుంచి మీడియాకు దూరంగా ఉంటున్నానని చెప్పాడు.
తాను నమ్రతను సీక్రెట్ గా పెళ్లిచేసుకున్నానని, తన కుటుంబ సభ్యులకు ఇష్టంలేకుండా చేసుకున్నానని వచ్చిన వార్తలు నన్ను మీడియాకు దూరం చేశాయని మహేష్ అన్నాడు. అయితే థమ్సప్ యాడ్ చేస్తున్న మహేష్ బాబు ఆ యాడ్ లో భాగంగా అతిథి మహేష్ భవ అంటూ థమ్సప్ తాగి విజేతలుగా నిలిచిన వారి ఇంటికి వెళ్లడం, ఆ సందర్భంగా మీడియా ఆయనతో మాట్లాడించడం కొద్దిరోజులుగా జరుగుతున్నదే.


Click it and Unblock the Notifications