మీ సొంతూర్లోనే మా సినిమా షూటింగ్: యూఎస్ కాన్సుల్ జనరల్‌తో మహేష్ బాబు మీటింగ్!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మహర్షి' షూటింగ్ నెక్ట్స్ షెడ్యూల్ అమెరికాలోని న్యూయార్క్‌లో జరుగబోతోంది. ఈ నేపథ్యంలో ఇద్దరూ కలిసి ఇటీవల హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సుల్ జనరల్ కేథరిన్ హడ్డాను కలిశారు.
ఈ సందర్భంగా వారితో కలిసి ఫోటో దిగిన కేథరిన్ హడ్డా... 'మా సొంతూరు న్యూయార్క్‌లో సినిమా షూటింగ్ ఎవరు చేయబోతున్నారో చూడండి?' అంటూ మహేష్ బాబు, వంశీ పైడిపల్లితో దిగిన ఫోటోను ట్విట్టర్లో షేర్ చేశారు.
కేథరిన్ హడ్డా చేసిన ట్వీటుపై మహేష్ బాబు స్పందిస్తూ.... 'మీతో సమావేశం అవ్వడం చాలా గొప్పగా ఉంది. ఇక మీ సొంతూరు న్యూయార్కులో జరిగే నా సినిమా షూటింగ్ మీద ఫోకస్ పెడతాను' అని రిప్లై ఇచ్చారు.
మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మహర్షి' మూవీ నెక్ట్స్ షెడ్యూల్ యూఎస్ఏలో ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.న్యూయార్క్, కాలిఫోర్నియా, లాస్ వెగాస్ తదితర ప్రాంతాల్లో ప్లాన్ చేశారు.

మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లరి నరేష్ ఓ కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానకి కేయూ మోహనన్ సినిమాటోగ్రఫీ సమకూర్చుతున్నారు. వంశీపైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వై జయంతి మూవీస్, పివిపి సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2019 ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











