థాంక్యూ మిస్టర్ మహేష్ బాబు.... అంటూ నమ్రత, ఏం జరిగింది?
మహేష్ బాబు తన ప్రత్యేక అభిమానిని కలిశారు. మానసిక వ్యాధితో బాధ పడుతున్న ఫ్యాన్ కోరికతీర్చారు.
హైదరాబాద్: 'థాంక్యూ మిస్టర్ మహేష్ బాబు' అంటూ తన భర్తను ఉద్దేంచి నమ్రత శిరోద్కర్ చేసిన ట్వీట్ చర్చనీయాంశం అయింది. ఇంతకీ నమ్రత ఈ ట్వీట్ ఎందుకు చేశారో చూద్దాం.
నమ్రత ఇలా అనడానికి కారణం... ఆయన ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ కోరిక తీర్చడమే. సుస్మిత అనే 14 ఏళ్ల బాలిక డౌన్ సిండ్రోమ్(మానసిక క్షీణత)తో బాధ పడుతోంది. ఆమెకు ఎప్పటి నుండో తన అభిమాన నటుడు సూపర్‌స్టార్ మహేష్ బాబును కలవాలని కోరిక. సుష్మిత కల నెరవేర్చాలని ఆమె తల్లిదండ్రులు 'హీల్ ఎ ఛైల్డ్ ఫౌండేషన్' సంప్రదించారు.

ఈ విషయమై మహేష్ బాబును ఆ ఫౌండేషన్ వారు సంప్రదించగా వెంటనే ఒకే చెప్పారు. బిజీ షెడ్యూల్‌లోనూ మహేష్ బాబు తన అభిమాని కోరిక తీర్చడంపై అందరి నుండి హర్షం వ్యక్తమవుతోంది.
ఈ విషయమై నమ్రత స్పందిస్తూ....చిన్న అమ్మాయి ముఖంలో పెద్ద చిరునవ్వు పూయించిన మిస్టర్ మహేష్ బాబుకు థాంక్స్' అంటూ నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఈ పోస్టు ఇపుడు వైరల్ అయింది.


Click it and Unblock the Notifications