twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ కొట్టిన దెబ్బకు దర్శకుడి కెరీర్ పై ప్రభావం.. ఖాళీగా ఉండాల్సిందేనా?

    |

    టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ పెద్దగానే ఉంది. అయితే చాలా వరకు నేటితరం హీరోలు దర్శకుల ట్రాక్ కంటే కూడా.. వారు ఎంచుకున్న కథలపైనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కథ నచ్చితేనే ముందుకు వెళ్లాలని ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేస్తే గాని సెట్స్ పైకి వెళ్లడం లేదు. మొన్నటివరకు మహేష్ బాబు కథలను పట్టించుకోకుండా దర్శకులనే ఎక్కువగా నమ్మేవారు. కొన్ని డిజాస్టర్స్ అనంతరం సూపర్ స్టార్ కూడా మారిపోయాడు.

    అంత ఈజీగా ఒప్పుకోవడం లేదు..

    అంత ఈజీగా ఒప్పుకోవడం లేదు..

    మహేష్ బాబు చాలా వరకు తన సినిమాల కారణంగా నిర్మాత నష్టపోకూడదనే అనుకుంటాడు. ఏ మాత్రం నష్టాలు వచ్చినా తట్టుకోలేరు. కొన్ని అపజయాల అనంతరం మహేష్ దర్శకులను నమ్మడం మానేశాడు. ముఖ్యంగా బ్రహ్మోత్సవం - స్పైడర్ డిజాస్టర్స్ అనంతరం ప్రయోగాలకు కూడా దూరంగా ఉండాలని ఫిక్స్ అయ్యాడు. ఎలాంటి దర్శకుడైనా సరే.. కథ నచ్చితేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు.

    మహేష్ మనసు మార్చుకున్నాడు..

    మహేష్ మనసు మార్చుకున్నాడు..

    మహేష్ బాబు డైరెక్టర్ వంశీ పైడిపల్లితో మహర్షి అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా నష్టాలు రాకుండా కాపడిందే గాని పెద్దగా లాభాలను అందించలేకపోయింది. ఆ సినిమా షూటింగ్ దశలోనే మహేష్ వంశీ పైడిపల్లితో ఒక సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించాడు. స్టోరీ లైన్ చెప్పి మెప్పించిన దర్శకుడు ఆ తరువాత పూర్తి కథతో మెప్పించలేకపోయాడు. పైగా మహర్షి రిజల్ట్ కూడా అనుకున్నంతగా రాకపోవడంతో మహేష్ మనసు మార్చుకున్నాడట.

    దర్శకుడి కెరీర్ పై ప్రభావం..

    దర్శకుడి కెరీర్ పై ప్రభావం..

    సరిలేరు నికేవ్వరు సినిమా అనంతరం మహేష్ వంశీ పైడిపల్లితోనే సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ కథ స్క్రిప్ట్ పై సందేహాలు కలగడంతో వెంటనే గీతగోవిందం దర్శకుడిని లైన్ లో పెట్టాడు. దీంతో వంశీ పైడిపల్లి కెరీర్ పై మహేష్ నిర్ణయం ప్రభావం చూపినట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే స్టార్ హీరోలు ఎవరు కూడా ఇప్పుడు ఖాళీగా లేరు. పైగా వంశీ కమర్షియల్ సినిమాలు రొటీన్ గా ఉంటాయనే ఒక టాక్ కూడా అతనికి మైనస్ గా మారింది. దీంతో వంశీతో చేయడానికి పెద్ద హీరోల్లో కొందరు సాహసించడం లేదు.

    Recommended Video

    Rajamouli Reveals His Next movie Details After RRR
    స్టార్ హీరోలు దొరకడం లేదట..

    స్టార్ హీరోలు దొరకడం లేదట..

    చాలా వరకు స్టార్ డైరెక్టర్స్ పెద్ద హీరోతో సినిమా చేశాక చిన్న సినిమాలు చేసి రిస్క్ లో పడకూడదని అనుకుంటూ ఉంటారు. అందుకే క్రేజ్ కి తగ్గట్టుగానే మరొక స్టార్ హీరోతో హై బడ్జెట్ ప్రాజెక్టును ప్లాన్ చేస్తుంటారు. వంశీ పైడిపల్లి కూడా అదే తరహాలో ప్రయత్నాలు చేస్తున్నాడు గాని వర్కౌట్ కావడం లేదు. ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, బన్నీ, వంటి స్టార్ హీరోలు బిజీగా ఉండడంతో మరొక ఏడాది పాటు ఖాళీగా ఉండాల్సి వస్తోంది. మరి వంశీ తన నెక్స్ట్ సినిమాను ఎవరితో ప్లాన్ చేస్తాడో చూడాలి.

    English summary
    Director Vamsi Paidipally got a rude shock of his life when Mahesh did not approve of his script. So, he is still waiting for a star hero to sign his new ptoject. He is tirelessly going to many heroes but all of them are busy as of now. So, until next year he has no option but to wait.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X