మహేష్ బాబు 25వ మూవీ టైటిల్ ఇదే, సూపర్ మీనింగ్... అదరగొట్టిన వంశీ పైడిపల్లి!
Recommended Video

మహేష్ బాబు కెరీర్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 25వ చిత్రానికి సంబంధించిన టైటిల్ వినూత్నంగా ఆవిష్కరిస్తున్నారు. రోజుకో అక్షరాన్ని విడుదల చేస్తూ దర్శకుడు వంశీ పైడిపల్లి అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఇప్పటికే ఆర్, ఐ, ఎస్ అనే అక్షరాలను విడుదల చేయగా... మంగళవారం ఉదయం 'హెచ్', 'ఐ' అనే అక్షరాలను ట్విట్టర్ ద్వారా రివీల్ చేశారు. దీంతో సినిమా టైటిల్ 'రిషి' అని ఖరారైంది. ఈ టైటిల్ పెట్టడం వెనక దర్శకుడు వంశీ పైడిపల్లి చాలా కసరత్తు చేశారు. ముఖ్యంగా ఒక్కో అక్షరంలో అర్థాన్ని వివరించిన తీరు ఆకట్టుకుంటోంది.
రీ మార్కబుల్ జర్నీ
మహేష్ బాబు ఇప్పటి వరకు 24 సినిమాలు చేశారు. ఈ సినిమాలతో ఆయన టాలీవుడ్ సూపర్ స్టార్ స్థాయికి ఎదిగారు. తన 24 సినిమాలను మించిపోయేలా 25వ మూవీ రీ మార్కబుల్ జర్నీగా ఉండబోతోంది. అందుకే తొలి అక్షరాన్ని ‘ఆర్' అని డిసైడ్ చేశారు.
ఇంట్రీగింగ్ పర్సన్
మహేష్ బాబులో బయటకు కనిపించని చాలా విషయాలు ఉన్నాయి. ఆయన ఎన్నో మంచి పనులు చేస్తూ ప్రేమను పంచే ప్రయత్నంచేస్తున్నారు. సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందుకే ఇంట్రీగింగ్ పర్సన్ పర్సన్ అని అర్థం వచ్చేలా రెండో అక్షరం ‘ఐ' అని పెట్టారు.
స్టార్
తెలుగు హీరోల్లో స్టార్ అనే పదానికి పర్ఫెక్టుగా సూటయ్యే వారిలో మహేష్ బాబు ఒకరు. అందుకే మూడో అక్షరం ‘ఎస్' అని డిసైడ్ చేశారు.
హ్యూమానిటేరియన్
మహేష్ బాబును ఒక మానవతా వాదిగా పేర్కొంటూ ఈ రోజు ‘హెచ్' అనే అక్షరం విడుదల చేశారు. ప్రజలు, అభిమానులు.... ఫ్యామిలీ పట్ల ఆయన చూపే ప్రేమ వెలకట్టలేనిది అని అర్థం వచ్చేలా ఇలా డిజైన్ చేశారు.
ఇమ్మెర్సబుల్ లవ్
టైటిల్‌లోని చివరి అక్షరం ‘ఐ'... అంటే గొప్ప ప్రేమను ప్రదర్శించే వ్యక్తి అని అర్థం.


Click it and Unblock the Notifications











