మహేష్ బాబు సింగిల్ లెటర్ కారులో షికారు!
మొన్నటి వరకు 'వరుడు" గా వినిపిస్తున్న మహేష్, త్రివిక్రమ్ ల చిత్రానికి ఒకే ఒక అక్షరం ఉండేలా త్రివిక్రమ్ టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు ఫిలింనగర్ లో ఓ పుకారు ఆకారం లేకుండా కారులో షికారు చేస్తుంది. అదేంటి, మొన్నటికి మొన్న 'కిలాడి" 'ఖలేజా" వంటి మహేష్ కు కలిసొచ్చే మూడక్షరాల టైటిల్స్ ను పరిశీలిస్తున్నామని విన్నాము కదా అంటారా అది నిజమే కాని త్రివిక్రమ్ సెంటిమెంట్ ప్రకారం కూడా టైటిల్స్ ను అనుకుంటున్నట్టు వినిపిస్తోంది.
ఏంటా సెంటిమెంట్ అంటే త్రివిక్రమ్ తన మొదటి చిత్రం 'నువ్వే నువ్వే" ను నాలుగక్షరాతో, మలి చిత్రం 'అతడు"ను మూడక్షరాలతో, మూడవ చిత్రం 'జల్సా"ను రెండక్షరాలతో రూపొందించాడు. న్యూమరలజీ ప్రకారం తనకు అక్షరాలు డిక్రీజ్ అయ్యే కొద్ది కలెక్షన్లు ఇంక్రీజ్ అవుతుండటంతో తన తాజా చిత్రానికి ఏకాక్షర టైటిల్ ను అనుకుంటున్నారట. అందునా మహేష్ మూడక్షరాల గత చిత్రం 'అతిధి" ఫలితం కూడా అంతంతమాత్రమే కావడంతో త్రివిక్రమ్ సెంటిమెంట్ కు కూడా ప్రాధాన్యత ఇస్తున్నట్లు రహస్య సమాచారమ్.


Click it and Unblock the Notifications











