twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్టార్ కాకపోయింటే డైరెక్టరో, ప్రొడ్యూసరో...: మహేష్

    By Sindhu
    |

    బాలనటుడిగా సినిమా అవకాశాల వల్ల ఓ సంవత్సరం స్కూలు నష్టపోయాను. దాంతో నాన్నగారు చదువుపై శ్రద్ద పెట్టమని చెప్పారు. అలా సినిమాలకి కామా పెట్టి కాలేజీ చదువుల పూర్తి చేశాను. ఆ తర్వాత మళ్లీ నేరుగా సినిమాల్లోకి పున: ప్రవేశం చేశా. చిన్నప్పుడే నటించడంవల్లో ఏమో, రీఎంట్రీలో పెద్దగా కెమెరా అంటే భయపడింది లేదు. నాన్నతో చిన్నప్పుడు షూటింగుల కెళ్లడం, వేసవి సెలవులు ఊటీలో ఎంజాయ్ చేయడం మర్చిపోలేని అనుభూతులు. బాల నటుడి పేరు తెచ్చిన సినిమాలన్నీ వేసవి సెలవుల్లో చేసినవే..

    నాన్నగారి కాలం వేరు. మాకాలం వేరు ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు లాగించేసేవారు అప్పట్లో, ఒకేసారి ఒక పాత్ర నుంచి మరో పాత్రలోకి లీనమవ్వడం అంత ఆసామాషీ విషయం కాదు. 350 సినిమాలలో విభిన్న పాత్రలు చేసిన సూపర్ స్టార్ నిజంగా గ్రేట్! ఆయనతో పదుల సంఖ్యలోనే సినిమాలు చేసిన నన్ను పోల్చి చూడడం సరికాదు. 'మురారి" చూసి నాన్నగారు భుజం తట్టనప్పుడు కలిగిన ఆనందం ఎప్పటికీ మర్చిపోలేను.

    ఖాళీగా ఉంటే నిద్ర తిండి, టీవీక్షణం...ఇంకా టైముంటే మళ్లీ పడుకోవడం అది మన దినచర్య. బిజీ షెడ్యూల్స్ నుంచి సేద దీరడానికే అలా చేస్తుంటాను. థియేటర్ కెళితే ఓ సామాన్యుడిలా ఎంజాయ్ చేస్తూ సినిమా చూస్తాం. ఇక్కడికంటే ఎక్కువగా ముంబైలోనే సినిమాలు ఎక్కువ చూస్తాం. నటుడిని కాకపోతే సినిమానే లోకంగా బతికే నేను..ఏ దర్శకుడినో, నిర్మాతతనో అయ్యుండేవాడిని...

    ప్రేక్షకులు చాలా తెలివైనవాళ్లు. ఉన్నతంగా ఆలోచిస్తున్నారు. వారి ఆలోచనలు, ఇష్టా ఇష్టాల ప్రకారమే స్టార్లు నడుచుకోవాలి.. నాకు స్నేహితులు తక్కువ. చిన్నప్పటి ఫ్రెండ్సంతా చెన్నైలో ఉన్నారు. ఎందుకంటే చదివింది అక్కడే కదా..పరిశ్రమలో జయంత్ సి ఫరాన్జీ, త్రివిక్రమ్ ఇలా దర్శకులే బెస్ట్ ఫ్రెండ్స్. దర్శకుడు త్రివిక్రమ్ తనకు ఏం కావలో అది చెప్పి చేయించుకుంటారు. తను మాత్రం నటించి చూపించరు అలా చేస్తే ప్రతి నటుడూ ఒకేలా కనిపిస్తారనేది అతడి ఫీలింగ్.

    English summary
    The audio of Mahesh Babu's much-talked Dookudu was launched last evening at Shilpakala Vedika in Hyderabad. The music launch, which was postponed for several times, finally saw the light of the day at the presence of bigwigs of the Telugu film industry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X