»   » మహేష్ బర్త్ డే గిఫ్ట్: ‘బ్రహ్మోత్సవం’ షాక్ నుండి తేరుకోవాలనే...

మహేష్ బర్త్ డే గిఫ్ట్: ‘బ్రహ్మోత్సవం’ షాక్ నుండి తేరుకోవాలనే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు సినిమా అయితే భారీ హిట్టవుతుంది.... లేదంటే పరమ ప్లాప్ టాక్ తెచ్చుకుంటుంది. ఈ మధ్య కాలంలో మహేష్ బాబు సినిమాలు చూస్తే ఇలానే ఉంది పరిస్థితి. ఈ ఏడాది మహేష్ బాబు హీరోగా వచ్చిన 'బ్రహ్మోత్సవం' మూవీ భారీ పరాజయం పాలైన సంగతి తెలిసిందే.

ఈ సినిమా చూసిన అభిమానులు సైతం తేరుకోలేనంతగా షాకయ్యారు. సాధారణంగా మహేష్ బాబు సినిమాలు కాస్త యావరేజ్ గా ఉన్నా జనాలు వెళతారు. అయితే సినిమా అస్సలు బాగోలేక పోవడానికి తోడు సోషల్ మీడియా ద్వారా తీవ్రంగా నెగెటివ్ టాక్ ప్రచారం జరుగడంతో బెంబేలెత్తిపోయిన సాధారణ ప్రేక్షకులు, ఫ్యామిలీ ఆడియన్స్ ఆ సాహసం చేయలేక పోయారు.


విషయం అర్థం చేసుకున్న మహేష్ బాబు అండ్ టీం కూడా....డబ్బులు రాబట్టుకోవాలనే బలవంతపు ప్రయత్నాలు కూడా చేయలేదు. ప్లాపైన సినిమాను సక్సెస్ మీట్స్, విజయోత్సవాల పేరుతో అనవసరంగా పుష్ చేసే ప్రయత్నం చేస్తే జనాల్లో బ్యాడ్ అవతామనే ఉద్దేశ్యంతో అంతా సైలెంట్ అయిపోయారు.


'బ్రహ్మోత్సవం' మిగిల్చిన చేదు జ్ఞాపకాన్ని ఫ్యామిలీతో విదేశాల్లో గడపడం ద్వారా మరిచిపోయే ప్రత్నం చేసారు మహేష్ బాబు. ఇండియా వచ్చిన తర్వాత తన మురుగదాస్ సినిమా ప్రాజెక్టు వ్యవహారాల్లో బిజీ అయిపోయారు. అయితే అభిమానులు కొందరు ఇంకా 'బ్రహ్మోత్సవం' షాక్ నుండి తేరుకోలేదని భావించిన మహేష్ బాబు వారిని ఆ షాక్ నుండి బయట పడేయడానికి, వారిలో నూతన ఉత్సాహాన్ని నింపేందుకు సిద్ధమయ్యారు.


తన బర్త్ డే సందర్భంగా మహేష్ బాబు అభిమానులకు గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.... (స్లైడ్ షోలో అందుకు సంబంధించిన విషయాలు)


ప్రారంభానికి ముందే..

ప్రారంభానికి ముందే..

మురుగదాస్‌తో సినిమా ప్రారంభానికి ముందే ఓ పోస్టర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


ఫోటోషూట్

ఫోటోషూట్

ఇటీవల మహేష్ బాబుతో ఓ ఫోటో షూట్ నిర్వహించారు. వాటితో మంచి పోస్టర్స్ డిజైన్ చేస్తున్నారు.


పుట్టినరోజు కానుక..

పుట్టినరోజు కానుక..

ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు ఉన్న నేపథ్యంలో ఆరోజే ఈ సినిమాకు సంబందించిన ప్రీ లుక్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


షూటింగ్

షూటింగ్

ఆగస్టు నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా ఎంపికైంది.


తల్లి పాత్రలో..

తల్లి పాత్రలో..

ఈ సినిమాలో మహేష్ బాబు తల్లి పాత్రలో కోలీవుడ్ నటి దీపా రామానుజమ్ ను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వచ్చిన 'బిచ్చగాడు' సినిమాలో తల్లి పాత్రలో అందరినీ ఆకట్టుకున్న ఆమె... ఇపుడు మహేష్ బాబుకు తల్లిగా కనిపించబోతోంది.


బ్యాలెన్స్

బ్యాలెన్స్

మహేష్ బాబు ఈ సినిమాతో తమిళంలోనూ తన మార్కెట్ పెంచుకోవాలని చూస్తున్నాడు. అందుకే మురుగదాస్ దర్శకత్వలో చేస్తున్నాడు. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమా ఒకేసారి తెరకెక్కబోతోంది. అందుకే నటీనటుల ఎంపిక విషయంలో రెండు బాషల నటీనటులు బ్యాలెన్స్ గా ఉండేలా చూసుకుంటున్నారు.


సూర్య, నదియా

సూర్య, నదియా

ఈ సినిమాలో దర్శకుడు ఎస్.జె.సూర్య కూడా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో అతడు మహేష్ బాబుకు విలన్ పాత్రలో కనిపిస్తాడని అంటున్నారు. ఎస్.జె.సూర్య భార్య పాత్రలో అత్తారంటికి ఫేం నదియా నటించబోతున్నట్లు టాక్. ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేసేలా షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేసారు.


English summary
Mahesh Babu doesn't like to disappoint his fans on special occasions. On August 9th which marks his birthday, Pre-Look of Mahesh Babu-AR Murugadoss Project will be released.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu