»   » లీకైన మహేష్ 23 మూవీ సాంగ్ ఇదే : పిచ్చ వైరల్ అవుతోంది

లీకైన మహేష్ 23 మూవీ సాంగ్ ఇదే : పిచ్చ వైరల్ అవుతోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒక పక్క పైరసీ ముఠాలతోనే చచ్చే చావొచ్చి పడిందీ అంటే ఇప్పుడు కొత్తగా లీకు వీరులు బయల్దేరారు. ఏదో ఒకటీ రెండు ఫొటోలైతే పరవాలేదు గానీ ఏకంగా సీన్లూ, పాటలు కూడా బయటికి వచ్చేస్తున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. బాహుబలి సినిమాకు సంబంధించి విజువల్స్, ఫైట్ లీకైన సంగతి తెలిసిందే.

ఇటీవలే కాటమరాయుడు క్లైమాక్స్ ఫైట్ లీకైంది.

ఇటీవలే కాటమరాయుడు క్లైమాక్స్ ఫైట్ లీకైంది.

ప్రిన్స్ 'మహేష్ బాబు'..'మురుగదాస్'..కాంబినేషన్ లో తెరెకెక్కుతున్న తాజా చిత్రం షూటింగ్ కొనసాగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఎలాంటి వార్తలు మాత్రం బయటకు పొక్కడం లేదు. కానీ తాజాగా ట్విట్టర్ లో 'మహేష్' ఫొటోను ట్విట్టర్ లో దర్శనమిచ్చింది. ఈ ఫొటోను సంతోష్ శివన్ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు.

ఇందులో

ఇందులో

'మహేష్' కొత్త లుక్ లో కనబడుతున్నారు. షూటింగ్ ప్రారంభమై చాలా రోజులే గడుస్తోంది. ప్రతి చిత్రంలో సామాజిక అంశాన్ని తెరకెక్కించే 'మురుగదాస్' ఈ చిత్రంలో ఎలాంటి సామాజిక అంశాన్ని సృశించారో తెలియరాలేదు. సినిమా టైటిల్ ఇంతవరకు ప్రకటించకపోవడం గమనార్హం.

ఒక సాంగ్ ట్రాక్ మొత్తం

ఒక సాంగ్ ట్రాక్ మొత్తం

ఈ సినిమా పేరు 'సంభవామి' అని .'ఏజెంట్ శివ' అని ఏటూ తేల్చకుండా అసలు టైటిల్ ని కూడా సీక్రేట్ గానే ఉంచుతూంటే ఉన్నట్టుండీ ఒక సాంగ్ ట్రాక్ మొత్తం లీకై బయటకు వచ్చింది. మరొక పక్క ఇదసలు మహేష్ సాంగ్ కాదనీ కావలనే ఏదో ప్రైవేట్ సాంగ్ కోసం పాడిన ట్రాక్ ని ఇలా వైరల్ చేస్తున్నారనీ అంటున్నారు

టాకీ పార్టు దాదాపు పూర్తైంది

టాకీ పార్టు దాదాపు పూర్తైంది

తాజాగా మహేశ్ కొత్త మూవీ సాంగ్ లీకైంది. ఇప్పటికే మహేశ్-మురుగదాస్ మూవీ షూటింగ్ టాకీ పార్టు దాదాపు పూర్తైంది. పాటల చిత్రీకరణ కోసం విదేశాలకు వెళుతోంది చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలో చిత్రంలోని ఓ సాంగ్ నెట్‌లో లీకై.. యూనిట్‌ను కలవరపెడుతోంది.

లీకువీరులు

లీకువీరులు

‘ఏ మాయల్లో..' అనే మెలోడియస్ సాంగ్‌ను లీకువీరులు నెట్‌లో పెట్టేశారు. హారిస్ జయరాజ్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ సాంగ్ లీకవడంతో నిర్మాతలు అప్రమత్తమయ్యారట. ఇకపై సినిమా లీకుల బారిన పడకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారట.

ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా

ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా

టాలీవుడ్ ప్రిన్స్ 'మహేష్ బాబు' నటిస్తున్న తాజా చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ప్రముఖ డైరెక్టర్ 'ఏ.ఆర్.మురుగదాస్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా 'మహేష్' కనిపించనున్నట్లు టాక్. సామాజిక అంశాలను మేళవించి సినిమాలను 'మురుగ దాస్' రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.

సామాజిక కోణాన్ని సృశించి

సామాజిక కోణాన్ని సృశించి

ఈ సినిమాలో కూడా ఓ సామాజిక కోణాన్ని సృశించినట్లు తెలుస్తోంది. తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. చిత్ర షూటింగ్ మాత్రం షరవేగంగా జరుగుతున్నా చిత్రానికి సంబంధించిన పోస్టర్స్, టీజర్ ఇంకా విడుదల కాలేదు. ఆఖరికి సినిమాకు పేరు కూడా పెట్టలేదు. దీనితో సినిమాపై ఇంకా భారీ అంచనాలు నెలకొంటున్నాయి.

English summary
leaked from Mahesh23 and is going viral on social media. Netizens are sharing the common link through several facebook pages and twitter accounts. However, makers have not yet responded on this issue.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu