కనాలని మహేష్... నావల్ల కాదన్న నమ్రత (ఫోటోలు)
హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి ఆదర్శ దంపతుల్లో మహేష్ బాబు-నమ్రత దంపతులను ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ప్రేమ వివాహం చేసుకుని ఇటు యూత్ కు ఆదర్శంగా నిలవడంతో పాటు, అటు అన్యోన్య దాంపత్యం సాగిస్తూ ఐకానిక్ జోడీగా పేరు తెచ్చుకున్నారు.
తాజాగా ఈ ఇద్దరు దంపతులు కలిసి ఈ రోజు కొండాపూర్లో కొత్తగా ఏర్పాటైన 'రెయిన్ బో చిల్డ్రన్ హాస్పటల్' ప్రారంభోత్సవానికి వచ్చారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేసిన మహేష్ బాబు.... మరో బిడ్డను కనాలని ఉందని తన మనసులోని మాటను చెప్పగా, పక్కనే ఉన్న ఆయన భార్య నమ్రత నా వల్ల కాదు బాబోయ్ అంటూ వ్యాఖ్యానించారు. దీంతో అక్కడ అందరి ముఖాల్లో నవ్వుల పూవులు పూసాయి.
ఇక మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే, ప్రస్తుతం మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం నెక్ట్స్ షెడ్యూల్ లండన్లో ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 40 రోజుల పాటు అక్కడే షూటింగ్ జరుగనున్నట్లు తెలుస్తోంది. అక్కడ పలు కీలక సీన్లు చిత్రీకరించనున్నారు.

రెయిన్ బో చిన్నపిల్లల ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో మహేష్ బాబు, నమ్రత.

హైదరాబాద్ కొండాపూర్లో కొత్తగా ఏర్పాటు చేసిన ఆసుపత్రిని ఈ సినీ దంపతులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా మహేష్ బాబు ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సౌకర్యాలపై సంతృప్త వ్యక్తం చేసారు.

మరో బిడ్డను కనాలని ఉందని మహేష్ తన మనసులోని మాటను చెప్పగా, పక్కనే ఉన్న ఆయన భార్య నమ్రత నా వల్ల కాదు బాబోయ్ అంటూ వ్యాఖ్యానించారు.

మహేష్, నమ్రత దంపతులకు ఇప్పటికే గౌతం కృష్ణ అనే బాబు, సితార అనే పాప ఉన్నారు.
ఈ చిత్రంలో క్రితి సానన్ హారోయిన్ గా చేస్తోంది. మహేష్‌తో 'దూకుడు' చిత్రాన్ని నిర్మించిన 14రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి తాజాగా అందిన ఆసక్తికర సమాచారం ఏమిటంటే.... బాలీవుడ్ మూవీ 'ఏక్ థా టైగర్'కు అద్భుతమైన ఫైట్స్ కంపోజ్ చేసిన హాలీవుడ్ ఫైట్ మాస్టర్ కాన్రాడ్ పాల్మిశానో 'మహేష్ బాబు-సుకుమార్' సినిమాకు పని చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











