ఒకే ఫ్రేమ్ లో మహేష్,నయన తార.. అలాంటి సమయంలో ఆమె నాకు సహాయం చేస్తుంది

సూపర్ స్టార్ మహేష్ బాబు, లేడీ సూపర్ స్టార్ నయనతార, మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ వోగ్ కవర్ పేజ్ పై కనిపించనున్నారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన కవర్ పేజ్ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మహేష్ లుక్, స్టైల్ ను చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

సౌత్లోని ముగ్గురు బడా స్టార్లను ఒకే కవర్ పేజ్ పైకి తీసుకురావడంతో అందం వచ్చిందని వారి ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ఈ సందర్భంగా వీరంతా వోగ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. మరి ఆ విషయాలేంటో తెలియాలంటే మ్యాగజైన్ ను చేజిక్కించుకోవాల్సిందే.

 Mahesh Babu, Nayanatara And Dulquer Salman On Vogue Cover page

అయితే కొన్ని విషయాలను మాత్రం వోగ్ వెల్లడించింది. ఫెయిల్యూర్స్ నుంచే పాఠాలు నేర్చుకుంటానని మహేష్, అలాంటి కథలు చెబితే.. అవసరమా? అని దర్శకులను ప్రశ్నిస్తానని నయనతార, చాలామందికి తానేవరో తెలీదని.. తోసుకుంటూ వెళ్తుంటారని దుల్కర్ సల్మాన్ ఇలా తమ వ్యక్తిగత విషయాలను వెల్లడించారు.

ఫెయిల్యూర్స్ అనేది ఓ నిది, సంపద లాంటిది.. వాటి నుంచి నేను చాలా నేర్చుకుంటాను. వాటిని బాగా అనలైజ్ చేసుకుంటాను.. అయితే మొదట బాధగా మాత్రం ఉంటుంది. అలాంటి సమయంలో నమ్రతా సహాయం చేస్తుంటుందని మహేష్ చెప్పుకొచ్చాడు. మరి మహేష్ ఇంకా ఎలాంటి విషయాలను వెల్లడించాడో తెలుసుకోవాలంటే అక్టోబర్ వోగ్ మ్యాగజైన్ ను చూడాల్సిందే. మహేష్ ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు చిత్రంతో బిజీగా ఉన్నాడు. అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X