నమ్రత షేర్ చేసిన వీడియో వైరల్: మహేష్ బాబు డెడ్లీ యాక్షన్ సీక్వెన్స్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ మహేష్ బాబుకు సంబంధించిన ప్రతి అంశం అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసిన యాడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మహేష్ బాబు కొన్నేళ్లుగా థమ్సప్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ డ్రింక్ ప్రమోషన్లో భాగంగా కొత్త యాక్షన్ వీడియో రిలీజ్ చేశారు. డెడ్లీ యాక్షన్ సీక్వెన్స్‌తో తెరకెక్కిన ఈ యాడ్ ఫిల్మ్ అభిమాను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
ఇలాంటి యాడ్ ఎప్పుడూ చూడలేదు
ఇలాంటి యాక్షన్ ప్యాక్డ్ యాడ్ ఫిల్మ్‌లో మహేష్ బాబును చూడటం ఇదే తొలిసారి. ఇందులో ఆయన చాలా కూల్‌గా, చాలా పవర్ ఫుల్‌గా కనిపించారు అంటూ నమ్రత వ్యాఖ్యానించారు.

మహేష్ బాబు ‘మహర్షి'
మహేష్ బాబు నటిస్తున్న సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆయన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి' సినిమా చేస్తూ బిజీగా గడుపుతున్నారు. సూపర్ స్టార్ కెరీర్లో 25వ సినిమా ఇది.

కీలక పాత్రలో నరేష్
ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా... అల్లరి నరేష్ కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. మహేష్ బాబు, నరేష్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలెట్ అయ్యేలా ఉంటాయట.

విలన్ పాత్రలో సాయి కుమార్?
టాలీవుడ్ సీనియర్ నటుడు సాయి కుమార్ ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











