For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కేక పెట్టిస్తున్న మహేష్ చిత్రం కొత్త లుక్ (ఫొటో)

    By Srikanya
    |
    హైదరాబాద్: సింగపూర్ లో వెకేషన్ పూర్తి చేసుకుని వచ్చిన మహేష్ మీడియా కళ్లకు చిక్కారు. ఆయన తాజా చిత్రం షూటింగ్ ఈ రోజు నుంచి మొదలు కానుంది. మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం లో మహేష్ కొత్త గెటప్ లో కనపడనున్న సంగతి తెలిసిందే.

    ఈ చిత్రంలో మహేష్ బాబు రాక్ స్టార్ గా కనిపించనున్నారు. అందుకోసం దర్శకుడు కొత్తలుక్ తో ప్రెజెంట్ చేస్తున్నారు. ఇక్కడ ఫోటటో కనిపిస్తున్నది మహేష్ బాబు న్యూలుక్.

    మహేష్ హెయిర్ స్టయిల్ తో పాటు బాడీలో కూడా చాలా మార్పులు కనిపిస్తున్నాయి కదా... పలు జాగ్రత్తలు తీసుకుని మరీ ఈ లుక్ ని రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ ఫోటో ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తోంది. అభిమానులను అలరిస్తోంది.

    మొదటినుంచీ మహేష్ బాబు తన హెయిర్ స్టైల్ దగ్గర నుంచి, బాడీ లాంగ్వేజ్ దాకా ప్రతీ చిత్రంలోనూ ఢిఫెరెంట్ గా చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా పోకిరి నుంచి ఆయన పూర్తిగా ఢిఫెరెంట్ లుక్ తో కనిపిస్తూ వస్తున్నారు.

    ప్రస్తుతం మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రంలోనూ ఆయన మొత్తం ఓవరాల్ గా కొత్తదనాన్ని ప్రెజెంట్ చేయటానికి, తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన ఇప్పటివరకూ కనిపించని ఆల్ట్రా మోడ్రన్ లుక్ లో కనిపించనున్నారు. ఆ లుక్ ఫ్యాన్స్ ని పూర్తిగా అలరిస్తుందని భావిస్తున్నారు.

    దర్శకుడు సుకుమార్ తన హీరోలను విభిన్నంగా చూపుతూ వస్తున్నారు. ఆర్య, ఆర్య 2లలో అల్లు అర్జున్ ని స్టైలిష్ గా చూపారు. అలాగే నాగచైతన్యను ఇంతకు ముందు ఎవరూ చూపని విధంగా 100% లవ్ లో ప్రెజెంట్ చేసారు. ఇప్పుడు ఆయన మహేష్ ని కొత్త అవతారంలో మరింత అందంగా చూపటానికి, తన రెగ్యులర్ కెమెరామెన్ రత్నవేలుతో కలిసి ప్రతీ ఫ్రేమ్ అందంగా తీర్చిదిద్దుతున్నారు.

    మహేష్‌ బాబు హీరోగా 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. కృతి సనన్‌ ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయం కాబోతోంది. అనిల్‌ సుంకర, గోపీచంద్‌ ఆచంట, రామ్‌ ఆచంట నిర్మాతలు. ''వినోదాత్మకంగా సాగే సినిమా ఇది. మహేష్‌ పాత్ర విభిన్నంగా సాగుతుంది'' అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

    English summary
    Mahesh Babu is back in city now after a week family vacation in Singapore.His new film in the direction of Sukumar will resume its shooting from today. Earlier we heard that Mahesh is working out for a toned body for Sukumar’s film and few sources says that Mahesh will be seen in a six-pack body in Sukumar’s film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X