కన్ఫూజ్ చేయొద్దు: మహేష్ బాబు
"ఇలా రౌండప్ చేసి కన్ఫూజ్ చేయొద్దు..ఎందుకంటే కన్ఫూజన్ లో ఎక్కువ కొట్టేస్తాను"అంటున్నారు మహేష్. ఆయన తాజా చిత్రం బిజినెస్ మ్యాన్ కోసం వదిలిన తాజా టీజర్ లో ఈ డైలాగ్ హైలెట్ గా ఉంది.తనని రౌండప్ చేసిన రౌడిలను చూస్తూ ఈ డైలాగు చెప్తాడు. ఆ తర్వాత వాళ్లను చావకొడ్తాడు.ఇక ఈ టీజర్ చూసిన వారంతా సినిమా ఓ రేంజిలో ఆడుతుంది.పోకిరి రికార్డులుని,దూకుడు సంచలాన్ని దాటేస్తుంది అంటున్నారు.
ఇక ఈ చిత్రం నేపధ్యం ముంబై మాఫియాలోని ఆయుధాల వ్యాపారం.. కొనుగోళ్ళు .. అమ్మకాల చుట్టూ తిరగనుందని తెలుస్తోంది.ముంబైలోనే ఎక్కువ బాగం షూట్ చేయాలని పూరీ భావిస్తున్నారు. గన్స్ నీడ్స్ నో ఎగ్రిమెంట్స్ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రం పూర్తిగా స్టైలిష్ గా సాగే యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అని చెప్తున్నారు. అలాగే ఈ చిత్రం హిందీ వెర్షన్ ని కూడా పూరి రెడీ చేస్తున్నారు.హిందీ వెర్షన్ లో అబిషేక్ బచ్చన్ చేయనున్నారు.
ఈ విషయమై పూరీ మాట్లాడుతూ... తెలుగు, హిందీ వెర్షన్స్ రెండూ ఒకేలా ఎందుకుంటాయి. ఒకటి ప్రత్యేకంగా మహేష్ కోసం తెలుగు ఆడియన్స్ ఇష్టపడేలా డిజైన్ చేసింది. మరొకటి అభిషేక్ బాడీ లాంగ్వేజ్ ని దృష్టిలో పెట్టుకుని బాలీవుడ్ ఆడియన్స్ కు నచ్చేలా చేసిన స్క్రిప్టు.అలాగే నేను తెలుగు వెర్షన్ కి రీమేక్ లాగ దీన్ని తీర్చిదిద్దదలుచుకోలేదు.అయితే రెండు చిత్రాలకు నేపధ్యం మాత్రం ముంబై మాత్రమే.అక్కడే కథ జరుగుతుంది. కథలో మార్పులు మాత్రం ఉంటాయి. అలాగే హీరోయిన్ గా కాజల్ ని కూడా తెలుగుకే పరిమితం చేసి హిందీకి వేరే ఫ్రెష్ ఫేస్ ని పరిచయం చేసే ఆలోచనలో ఉన్నాను.


Click it and Unblock the Notifications











