twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరుణాకరన్ దర్శకత్వంలో మహేష్ బాబు

    By Bojja Kumar
    |

    పవన్ కళ్యాణ్‌తో తొలి ప్రేమ, ప్రభాస్‌తో డార్లింగ్ లాంటి సూపర్ హిట్ లవ్ స్టోరీలను తెరకెక్కించిన దర్శకుడు కరుణాకరన్ త్వరలో సూపర్ స్టార్ మహేష్ బాబును డైరెక్ట్ చేయబోతున్నాడనే వార్తలు ఎప్పటి నుండో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన కథ కూడా ఓకే అయిందనీ, మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనీ చర్చించుకుంటున్నారు. ఈ చిత్రాన్ని నిర్మాత బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తాడని సమాచారం. ప్రేమకథ చుట్టూ సాగే యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందించే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

    ప్రస్తుతం మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' అనే మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఇక కరుణాకరన్ ప్రస్తుతం రామ్, తమన్నా జంటగా 'ఎందుకంటే... ప్రేమంట' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యాక మహేష్ బాబు-కరుణాకరన్ కాంబినేషన్ మొదలయ్యే అవకాశం ఉంది.

    English summary
    Super Star Mahesh Babu is likely to act in a new movie under the direction of love stories specialist Karunakaran.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X