మహేష్ బాబు 'కలేజా'!
మహేష్ బాబు, త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో 'అతడు' చిత్రం తర్వాత రాబోవు చిత్రానికి 'కలేజా' లేదా 'కిలాడీ' అనే టైటిల్స్ పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఇందులో 'కలేజా' అనే టైటిల్ ను దాదాపు ఖరారు చేసినట్టు సమాచారం. ఇంతకు ముందు 'వరుడు' అనే పేరును ఖరారు చేసినట్టు ప్రచారం జరిగినప్పటికీ, ఇప్పుడా టైటిల్ ను అల్లు అర్జున్, గుణశేఖర్ ల కాంబినేషన్ లో వస్తున్న చిత్రానికి పెట్టడంతో, మహేష్ సినిమా టైటిల్ గురించి అందరిలోనూ ఆశక్తి నెలకొంది. మహేష్ బాబు తో 'బొమ్మాలి' అనుష్క తొలి సారి నటిస్తున్న ఈ చిత్రం లో వీరి కాంబినేషన్ కూడా ఆశక్తి రేపుతోంది.
ఇంతకు ముందు 'వరుడు' అనే పేరును ఖరారు చేసినప్పటికీ స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చెయ్యడంతో టైటిల్ ను మార్చడం జరిగినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగా రాజస్థాన్ లో జరుగుతోంది.
mahesh babu kaleja trivikram kiladi varudu anushka allu arjun guna sekhar మహేష్ బాబు కలేజా త్రివిక్రమ్ శ్రీనివాస్ కిలాడీ అనుష్క అల్లు అర్జున్ గుణశేఖర్


Click it and Unblock the Notifications