దుబాయ్‌లో ఫ్యామిలీతో మహేష్ బాబు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ (ఫోటోస్)
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 2019 నూతన సంవత్సర వేడుకలు కుటుంబంతో కలిసి గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సారి కొత్త సంవత్సరాన్నిస్వాగతించే సంబరాల్లో మునిగి తేలడానికి కుటుంబంతో కలిసి దుబాయ్ వెళ్లారు. ఈ ఫోటోలను నమ్రత అభిమానులతో పంచుకున్నారు.
హైదరాబాద్‌లో రామ్ చరణ్, ఇతర స్నేహితులు, సన్నిహితులతో క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న మహేష్ బాబు ఫ్యామిలీ అనంతరం దుబాయ్‌లో ల్యాండ్ అయ్యారు. జీరో డే వేడుకల కోసం మూడు రోజుల ముందే అక్కడికి చేరుకున్నారు.
అభిమానులను విష్ చేస్తూ మహేష్ బాబు ట్వీట్
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన మహేష్ బాబు.... కుటుంబం, ఫ్యాన్స్ సపోర్టుతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నట్లు వెల్లడించారు.

స్నేహితులతో కలిసి
దుబాయ్‌లో స్నేహితులతో కలిసి న్యూ ఇయర్ వేడుకలను ఆస్వాదిస్తున్న మహేష్ బాబు, కుటుంబ సభ్యులు. ఈ ఫోటోను నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

స్నేహితులతో కలిసి చిల్ అవుతూ...
న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా దుబాయ్‌లో స్నేహితులతో కలసి చిల్ అవుతున్న మహేష్ బాబు. సూపర్ స్టార్ లుక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

మహర్షి
మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే.... ప్రస్తుతం ఆయన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. న్యూ ఇయర్ సందర్భంగా విడుదల చేసిన సెకండ్ లుక్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. దిల్ రాజు, అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











