మహేష్ బాబు ది అదృష్టమా...అద్భుతమా...!?
నిన్నటి వరకు మూడు సంవత్సరాలకో సినిమా, సంవత్సరానికో సినిమా చేస్తూ వచ్చిన మహేష్ ఒక్కసారిగా చేతినిండా సినిమాలతో బిజీ అయిపోయాడు. 'దూకుడు" షూటింగ్ పూర్తయిన వెంటనే బ్రేక్ తీసుకోకుండా 'బిజినెస్ మేన్" షూటింగ్ కి ముంబాయి వెళ్ళిపోయాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న 'సీతమ్మ మాకిట్లో సిరిమల్లె చెట్టు" షూటింగ్ లో వెంకటేష్ తో కలిసి పాల్గొంటాడు..
దీని తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా స్టార్ట్ అవుతోంది. ఈ సినిమా షూటింగ్ జరగుతుండగానే క్రిష్ దర్శకత్వంలో మరో సినిమా చెయ్యాలని మహేష్ ప్లాన్ చేస్తున్నాడు. ఒక్క సినిమా కోసం సంవత్సరాల తరబడి పనిచేసి విసుగొచ్చిన మహేష్ ఒక్కసారిగా స్పీడందుకున్నాడు. ఇందంతూ చూస్తున్న ఇండస్ట్రీ జనాలు ఇదంతా మహేష్ అదృష్టమా, అద్భుతమా అని ముక్కున వేలేసుకుంటున్నారు.
దూకుడు సినిమా విజాయన్ని చూసి మహేష్ బాబు అభిమానులు తమ హీరోకి ఇక తిరుగు లేదని బలంగా నమ్ముతున్నారు. అయితే నందమూరి, మెగా అభిమానులు మాత్రం ఇది అబద్దం కాదు, వాస్తవమే అని ఒప్పుకొంటున్నారు. ఎందు కంటే దూకుడు సినిమాకి రిలీజ్ టైమింగ్ బాగా కలిసి వచ్చిందని, అప్పటికి నిఖార్సయిన తెలుగు సినిమా చూసి చాలా కాలం కావడంతో, పెద్ద పస్టార్ సినిమా వచ్చేసరికి జనం ఎగబడ్డారని, సాధారణంగా తొలివారంలో సినిమాలు చూడని ప్రేక్షకుల కూడా థియేటర్ల వద్ద బారులు తీరారని అందువల్ల దూకుడుకి వసూళ్ల వరద సాధ్యమైందని విశ్లేషిస్తున్నారు.
ఏడాది క్రితం విడుదలైన ఖలేజా అంత పెద్ద డిజాస్టర్ అయినప్పడు ఈ ఏడాదిలో మహేష్ రేంజ్ ఎలా పెరిగిపోయి ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ మహేష్ తన మలి చిత్రం 'ది బిజినెస్ మ్యాన్" తోనూ ఇదే విధమైన సందడి చేయగలిగితే మాత్రం 'దూకుడు" కేవలం ఫ్లూక్ కాదని, మహేష్ బలమేనని ఒప్పుకోవచ్చని సినీ విశ్లేషకులు అంటున్నారు.


Click it and Unblock the Notifications











