»   » ఆ వార్తలు నిజం కాదు: మహేష్ బాబు ఏ ఈవెంటుకు హాజరుకావడం లేదు!

ఆ వార్తలు నిజం కాదు: మహేష్ బాబు ఏ ఈవెంటుకు హాజరుకావడం లేదు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన తాజా చిత్రం 'భరత్ అనే నేను' షూటింగ్‌‌లో బిజీగా గడుపుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 20 ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో షూటింగ్, ప్రోస్టు ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.

కాగా... మహేష్ బాబు విజయవాడలో ఈ నెల 24, 25వ తేదీల్లో సాగే నేవీ ఈవెంటులో పాల్గొంటారని వార్తలు వస్తున్న నేపథ్యంలో మహష్ బాబు సోషల్ మీడియా టీమ్ దీనిపై స్పష్టత ఇస్తూ ఓ ప్రకటన చేశారు. మహేష్ బాబు ఏ ఈ వెంటుకు హాజురు కావడం లేదని, ఆ వార్తలు నిజం కాదని తెలిపారు.

Mahesh Babu not to attend Navy show

ప్రస్తుతం మహేష్ బాబు 'భరత్ అనే నేను' చిత్రం షూటింగులో క్షణం తీరిక లేకుండా బిజీగా గడుపుతున్నారని తెలిపారు. మార్చి నెలాఖరుకల్లా షూటింగ్ పనులు పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో యూనిట్ పని చేస్తోందన్నారు.

'భరత్ అనే నేను' చిత్రంలో మహేష్ బాబు తొలిసారి ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నారు. ఇప్పటి వరకు చేయని సరికొత్త పొలిటికల్ డ్రామాతో ప్రేక్షకులను అలరించబోతున్నారు సూపర్ స్టార్. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వస్తోంది.

English summary
There have been reports in a section of media that Mahesh will be attending the Navy show in Vijayawada on the 24th and 25th of this month. However, Mahesh’s social media team is quick to clarify that the actor will not be attending the event because of his hectic schedules.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu