షాకింగ్: రాజమౌళిని పక్కన పెట్టి.. మరో దర్శకుడితో మహేష్ బాబు సినిమా.. కారణం అదేనట!
సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో సినిమా కోసం ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి RRR షూటింగులో బిజీగా ఉండగా, మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా కోసం రెడీ అవుతున్నారు. అయితే RRR తర్వాత మహేష్, రాజమౌళి చేతులు కలుపుతారని అందరూ ఊహిస్తున్నారు. అయితే తన తర్వాత సినిమా రాజమౌళితో కాకుండా వేరే దర్శకుడితో మహేష్ ప్లాన్ చేస్తున్నారనే విషయం ఆసక్తిగా మారింది. వివరాల్లోకి వెళితే..

RRR మూవీకి అడ్డంకులు
RRR చిత్ర మొదలైనప్పటి నుంచి రాజమౌళికి ఏదో ఒక రూపంలో షూటింగుకు అంతరాయం కలుగుతూనే ఉంది. ఎన్టీఆర్, రాంచరణ్ గాయాల కారణంగా కొంతకాలం షూటింగ్ వాయిదా పడితే.. హీరోయిన్ కారణం మరోసారి వాయిదా పడింది. అంతా సవ్యంగా సాగుతున్నదనే సమయంలో కరోనావైరస్ భారీ దెబ్బ కొట్టింది.

షెడ్యూల్స్ అన్నీ గందరగోళం
లాక్‌డౌన్ విధించడంతో RRR చిత్రం సినిమా షూటింగులు, షెడ్యూల్స్ అని గందరగోళంగా మారిపోయాయనేది అందరికీ అర్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇంకా షూటింగ్ చేయాల్సి ఉండటం, అలాగే ప్రొస్టు ప్రొడక్షన్ పనులు, ప్రమోషన్ ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడే ముగిసేటట్టు కనిపించడం లేదు. దాంతో మహేష్ సినిమా మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తున్నది.

మహేష్ పరుశురాం సినిమా
అయితే రాజమౌళి బిజీ షెడ్యూల్, RRR మూవీ రిలీజ్ ఆలస్యమయ్యే పరిస్థితులు ఉండటం, అలాగే ఆ మధ్యలో తన పరుశురాం సినిమాకు భారీ గ్యాప్ వచ్చే పరిస్థితి ఉన్నందున మరో చిత్రాన్ని తెర మీదకు మహేష్ బాబు తెచ్చినట్టు సమాచారం. RRR సినిమా పనులు పూర్తయ్యే లోపు మరో దర్శకుడితో ఓ సినిమా చేయాలనే ప్లాన్‌లో మహేష్ ఉన్నట్టు తెలుస్తున్నది.

పూరీతో సినిమా
ఈ క్రమంలో పూరీ కథ చెబితే వినడానికి తాను ఎంతో ఆసక్తిగా ఉన్నానంటూ మహేష్ బాబు ట్వీట్ చేయడం సినీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. పూరీ అంటే నాకు చాలా గౌరవం, ఆయన దర్శకత్వంలో సినిమా చేయడానికి నేను ఎప్పుడూ సిద్దంగా ఉంటానని చెప్పడం గమనార్హం. అయితే పూరీతో వేగంగా ఓ సినిమా చేయాలనే ఉద్దేశంలో మహేష్ ఉన్నట్టు తెలుస్తున్నది.
Recommended Video

తమిళ దర్శకుడితో సంప్రదింపులు
ఇక అంతేకాకుండా ఓ తమిళ దర్శకుడితో మహేష్ కథా చర్చలు జరుపుతున్నారనే విషయం కూడా వెలుగులోకి వచ్చింది. తమిళ దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో ఆయన సానుకూలంగా ఉన్నారని, జక్కన సినిమాకు మధ్య గ్యాప్‌లో పూరీతో గానీ, తమిళ దర్శకుడితో గానీ సినిమా చేసేందుకు రెడీగా ఉన్నారనేది తాజా సమాచారం. పరుశురాం సినిమాకు రాజమౌళి సినిమాకు మధ్య మరో చిత్రం రావడానికి ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











