Don't Miss!
- News ఎస్..ఇదే కడప, రాయలసీమ కల్చర్ - సీఎం జగన్..!!
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
డైరెక్టర్ భార్య బర్త్ డే పార్టీలో... సతీసమేతంగా మహేష్ బాబు, ఎన్టీఆర్ సందడి! (ఫోటోస్)
సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కుటుంబ సమేతంగా ఒకే చోట చేరి సందడి చేశారు. విశేషం ఏమిటంటే... దర్శకుడు వంశీ పైడిపల్లి భార్య మాలిని పైడిపల్లి పుట్టినరోజు వేడుక. సోమవారం రాత్రి హైదరాబాద్‌లో ఈ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. పార్టీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన 'మహర్షి' చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఫ్రీ టైమ్ ఉండటంతో మహేష్ బాబు తన భార్య, పిల్లలతో కలిసి ఈ వేడుకకు హాజరయ్యారు. 'RRR' షూటింగ్ లేక పోవడంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఈ పుట్టినరోజు వేడుకకు భార్యతో కలిసి విచ్చేశారు.
బర్త్ డే పార్టీ సెల్ఫీ
మాలిని పైడిపల్లి పుట్టినరోజు వేడుకలో పాల్గొన్న మహేష్ బాబు, నమ్రత, జూ ఎన్టీఆర్, లక్ష్మి ప్రణతి అంతా కలిసి సెల్ఫీ దిగారు. ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహేష్, ఎన్టీఆర్ అభిమానులు మాలిని పైడిపల్లికి బర్త్ డే విషెస్ తెలుపుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
స్టార్ వైఫ్స్ అంతా ఒకే ఫ్రేములో
పుట్టినరోజు వేడుకలో లేడీస్ అంతా కలిసి ఒక చోట చేరి సందడి చేశారు. నమ్రత, లక్ష్మి ప్రణతి, మాలిని పైడిపల్లి, మరికొందరు కలిసి ఇలా ఫోటోలకు ఫోజలు ఇచ్చారు. టాలీవుడ్ టాప్ స్టార్స్ ఫ్యామిలీస్ ఈ మధ్య తరచూ ఏదో పార్టీలో కలిసి సందడి చేయడం పరిపాటిగా మారింది.
లక్ష్మి ప్రణతితో కలిసి మాలిని పైడిపల్లి
ఎన్టీఆర్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ‘బృందావనం' అప్పట్లో సంచలన విజయం అందుకుంది. ఈ విజయం అందుకున్న మరుసటి ఏడాదే ఎన్టీఆర్-లక్ష్మీ ప్రణతి వివాహ జరిగింది. అప్పటి నుంచే వంశీ పైడిపల్లి ఫ్యామిలీతో ఎన్టీఆర్-లక్ష్మీ ప్రణతికి మంచి స్నేహబంధం ఏర్పడింది.
స్టార్స్ కిడ్స్
మాలిని పైడిపల్లి పుట్టినరోజు వేడుకలో మహేష్ బాబు గారాల కూతురు సితార, వంశీ పైడిపల్లి కూతురు. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. స్టార్స్ కిడ్స్ అంతా కలసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.