రిలాక్సేషన్ కోసం మహేష్ దుబాయి ట్రిప్
హైదరాబాద్ : కంటిన్యూగా రెగ్యులర్ షూటింగ్ లలో పాల్గొంటూ వస్తున్న మహేష్ బాబు తన ప్యామిలీతో కలిసి దుబాయి ట్రిప్ ప్లాన్ చేసారు. అక్కడ కొద్ది రోజులు ఉండి, సీతమ్మ వాకిట్లో రిలీజుకు మందు తిరుగు ప్రయాణం పెట్టుకుంటారు. భార్య,పిల్లలతో కలిసి ఈ ట్రిప్ ని మహేష్ ప్లాన్ చేసుకున్నారు. అక్కడనుంచి రాగానే సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు ప్రమోషన్ లో పాల్గొంటారని తెలుస్తోంది. ట్రిప్ నుంచి వచ్చాక వరసగా సీతమ్మ వాకిట్లో గురించి టీవి ఇంటర్వూలు, వెంకటేష్ తో కలిసి పనిచేయటం గురించి ఎక్సపీయన్స్ కి చెందిన విషయాలు,జాయింట్ ఫ్యామిలీస్ గురించి విషయాలు చర్చిస్తూ ఇంటర్వూలు ప్లాన్ చేస్తున్నారు.
ఓ ప్రక్క సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మరో ప్రక్క సుకుమార్ చిత్రాలతో మహేష్ చాలా బిజీగా ఉంటున్నారు. దీనికి తోడు ఎప్పుడన్నా షూటింగ్ బ్రేక్ వస్తే యాడ్స్ కు,తాను ఒప్పుకున్న బ్రాండ్ అంబాసిడర్ పనులకు అంకితమవుతున్నారు. వాటికి సంభందించిన ప్రోమోలు,ఫోటో షూట్ లలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈ నేపధ్యంలో మహేష్ భార్య పట్టుబట్టి ఈ హాలీడే ట్రిప్ ని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
మరో ప్రక్క మహేష్ వరసగా చిత్రాలు కమిటవుతున్నారు. మహేష్ బాబు,క్రిష్ కాంబినేషన్ లో ఓ చిత్రం ఓకే చేసారు. తెలుగుతోపాటు తమిళంలోనూ ఈ సినిమా రూపొందబోతోంది. మహేష్ హీరోగా నటించే తొలి తమిళ చిత్రం ఇదే అవుతుంది. గతంలో వానమ్ చిత్రంతో తమిళంలో క్రిష్ ..వేదం రీమేక్ ని చేసిన అనుభవం ఈ సినిమాకు ప్లస్ అవుతుంది.
దీన్ని దృష్టిలో పెట్టుకుని మహేష్ ఓకే ఇచ్చాడని,క్రిష్ తమిళంకు కావాల్సిన మార్పులు అద్దటానికి స్క్రిప్ట్ మీద ఉన్నారని తెలుస్తోంది.
ఇక ఈ చిత్రం ద్వారా హిందీ హీరోయిన్ సోనాక్షి సిన్హా దక్షిణాది చిత్రసీమలోకి అడుగుపెట్టబోతోంది. ఈ మేరకు చర్చలు జరిగాయి. అయితే ఆమె డేట్స్ ఎడ్జెస్ట్ చేసుకుని తెలుగుకు ఓకే చేసింది. ఆమె దక్షిణాదిలో చేస్తున్న తొలి చిత్రం ఇదే అవుతుంది. ప్రముఖ నిర్మాణ సంస్ధ వైజయంతి మూవీస్ మహేష్‌బాబు తో ఈ చిత్రాన్ని భారీగా నిర్మించనుంది. సి.అశ్వనీదత్ నిర్మాత. అశ్వనీదత్ కూతురు స్వప్నదత్ ఈ చిత్రాన్ని సమర్పించనుంది. ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న ఓ సమస్యను ఈ చిత్రంలో రాధాకృష్ణ జాగర్లమూడి (క్రిష్)ఈ చిత్రంలో చర్చించనున్నారు.


Click it and Unblock the Notifications











