»   » బావుందయ్యా... మహేష్ బాబు ఇవ్వడం, వారు ఎంజాయ్ చేయడం!

బావుందయ్యా... మహేష్ బాబు ఇవ్వడం, వారు ఎంజాయ్ చేయడం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ నుండి పలువురు హీరోలు, హీరోయిన్లు తమ హిందీ సినిమాల ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్ రావడం మామూలే. ఇక్కడ ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి సినిమా గురించి ప్రచారం చేసుకుంటారు. ఇలాంటి సందర్బాల్లో హీరోయిన్లను టార్గెట్ చేస్తూ తెలుగు మీడియా ప్రతినిధులు ఓ కామన్ క్వశ్చన్ అడుగుతుంటారు.

తెలుగు హీరోల్లో మీకు ఏ హీరో అంటే ఇష్టం? ఇక్కడ ఎవరితో నటించడానికి ఇష్టపడతారు అంటూ ప్రశ్నిస్తుంటారు. గతంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు దీపిక పదుకోన్, సోనాక్షి సిన్హా, అలియా భట్ తదితరులు మహేష్ బాబే తమ ఫేవరెట్ హీరో అని, ఆయనో నటించడానికి సిద్ధమే అని ప్రకటించేసిన సంగతి తెలిసిందే.

తాజాగా 'కి అండ్ కా' ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్ వచ్చిన కరీనా కపూర్ కు కూడా ఇదే ప్రశ్న ఎదురైంది. ఆమె కూడా మహేష్ బాబు మంత్రమే జపించడం గమనార్హం. మహేష్ బాబుతో పాటు ఆయన భార్య నమ్రత.... తన భర్త సైఫ్ అలీ ఖాన్ కు చాలా క్లోజ్ అని కరీనా చెప్పుకొచ్చింది.

 Mahesh Babu Often Sends Handpicked DVDs To This Bollywood Couple, SEE WHO!

హాలిడే కోసం హైదరాబాద్ వచ్చినపుడు మహేష్ బాబు ఫ్యామిలీని కలుస్తుంటామని... ఆ సమయంలో మహేష్ బాబు ప్రత్యేకంగా కొన్ని ఎంపిక చేసిన తెలుగు సినిమాల డీవీడీలు ఇచ్చి చూడమని చెబుతంటారు. ఆయన సూచించిన సినిమాలు చూసి నేను, సైఫ్ చాలా ఎంజాయ్ చేస్తాం అంటూ కరీనా చెప్పుకొచ్చింది.

ఇప్పటి వరకు తెలుగు సినిమాల్లో నటించక పోవడానికి కారణం ఏమిటి? అనే ప్రశ్నకు కరీనా కపూర్ సమాధానం ఇస్తూ.... నాకు తెలుగు సినిమాలు చేయడం అంటే ఇష్టమే, అయితే లాంగ్వేజ్ సమస్య వల్ల తెలుగు సినిమాలు ఇప్పటి వరకు చేయలేదు అని కరీనా తెలిపారు.

English summary
Yet another Bollywood heroine confessed that her favorite Telugu actor is Mahesh Babu, joining the likes of Deepika Padukone, Alia Bhatt, Sonakshi Sinha. This time, it is none other than, Kareena Kapoor.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu