హాట్ న్యూస్ : మహేష్ కొత్త చిత్రం 'కృష్ణా ముకుందా మురారి'
హైదరాబాద్ : మహేష్‌బాబు మరో కొత్త చిత్రం కమిటయ్యారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తారు. ఈ సినిమాకి 'కృష్ణా ముకుందా మురారి' అనే పేరు పరిశీలిస్తున్నారు. వంశీ ప్రస్తుతం రామ్‌చరణ్‌తో 'ఎవడు' రూపొందిస్తున్నారు. ఇది పూర్తయిన తరవాత మహేష్ చిత్రం మొదలవుతుంది. దిల్ రాజు స్నేహితుడైన నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్ గా మహేష్ ని కలిసిన వంశీ పైడిపల్లి బేసిక్ స్టోరీ లైన్ ని ఓకే చేయించుకున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ తో చేసిన బృందావనం తరహాలో రొమాంటిక్ ఫ్యామిలీ,యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండనుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు కొద్ది రోజుల్లో వెల్లడవుతాయి.
మహేష్ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'తో ఈ శీతాకాలంలో సందడి చేయబోతున్నారు. ఇది ఓ వైపు నడుస్తుండగానే మరో వంక సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్నారు. వెంకటేష్- మహేష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ఆడియో పంక్షన్ ని తిరుపతి లో నిర్వహించాలని ప్లాన్ చేస్తనున్నట్లు సమాచారం. వేలాది మంది వెంకటేష్ ప్యాన్స్,మహేష్ ప్యాన్స్ సమక్షంలో గ్రాండ్ గా ఈ చిత్రం ఆడియో చేయాలని దిల్ రాజు తన హీరోలతో చెప్పినట్లు తెలుస్తోంది. నవంబర్ లో ఈ ఆడియో పంక్షన్ జరపాలని నిర్ణయించారు.
సెప్టెంబర్ 17 నుంచి ఈ చిత్రం కొత్త షెడ్యూల్ ప్రారంభం అయ్యింది. దాదాపు యాభై శాతం ఈ చిత్రం షూటింగ్ పూర్తైంది. మహేష్ సరసన సమంత, వెంకటేష్ సరసన అంజలి నటిస్తున్నారు. వెంకీ-మహేష్ అన్నదమ్ముళ్లుగా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే టాలీవుడ్ లో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. అన్నదమ్ముల రిలేషన్ ఈ చిత్రంలో మెయిన్‌గా ఫోకస్ కానుంది. ఇక ఈ చిత్రం గురించి దిల్ రాజు మాట్లాడుతూ ..25 సంవత్సరాల తర్వాత వస్తున్న మల్టీస్టారర్ ఇది. వెంకీ, మహేష్ అన్నదమ్ము లుగా నటిస్తున్నారు. సీతమ్మ వాకిలి.. అంటే భారతదేశం, సిరిమల్లె చెట్టు..అంటే కుటుంబం అన్నారు.
సమంత, అంజలి, ప్రకాష్ రాజ్, జయసుధ, రోహిణి హట్టంగడి, రావు రమేష్, ఆహుతి ప్రసాద్, బ్రహ్మానందం, రమాప్రభ, తనికెళ్ల భరణి, కోట శ్రీనివాసరావు, రవిబాబు తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి సంగీతం: మిక్కీ జె. మేయర్, కెమెరా: కె.వి.గుహన్, కళ: ఎ.ఎస్. ప్రకాష్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత: దిల్ రాజు, కథ- స్క్రీన్ ప్లే- మాటలు- దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల.


Click it and Unblock the Notifications











