For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మహేష్ బాబులో ఇంత కిక్ ఎప్పుడూ చూడలేదంటున్న ఫ్యాన్స్!

|
Mahesh Babu Emotional Tweets On Director Vamshi Paidipally Goes Viral

సూపర్ స్టార్ మహేష్ బాబు గతంలో ఎప్పుడూ లేనంత ఆనందంగా కనిపిస్తున్నారని అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. మే 9న 'మహర్షి' సినిమా రిలీజైంది మొదలు... ప్రతి రోజూ సక్సెస్ అనే కిక్కులో మునిగితేలుతున్నారు. ఇంతకు ముందు ఎన్నడూ ఏ సినిమాకు లేని విధంగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు 25వ సినిమా విజయం మహేష్ బాబుకు ఎంత కిక్ ఇచ్చిందో....

సూపర్ స్టార్ గతంలో చాలా హిట్స్ చూశారు.. కానీ ఏ సినిమా విషయంలోనూ ఆయన ఇంత హ్యాపీగా లేరు. ఎందుకంటే ఈ సినిమా ఆయనకు విజయంతో పాటు గౌరవాన్ని తెచ్చిపెట్టింది. రైతుల గురించి, వ్యవసాయం ప్రాముఖ్యత గురించి తెలుపుతూ చేసిన ఈ చిత్రంపై పూర్తి సంతృప్తిగా ఉన్నారాయన.

నా జీవితంలో ఎప్పుడూ గుర్తుండి పోతోంది

‘మహర్షి' చిత్రం తన కెరీర్లో గుర్తుండి పోతుందని, భవిష్యత్తులో నా పిల్లలకు ఇలాంటి సినిమా చేశాను అని గర్వంగా చెప్పుకోగల ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని మహేష్ బాబు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. తన 25 సినిమాల కెరీర్లో తొలిసారిగా ఆయన ‘మహర్షి' సక్సెస్ మీట్‌లో కాలర్ ఎగరేసి సెన్సేషన్ క్రియేట్ చేశారు.

నీకు ఎప్పుడూ గ్రేట్‌ఫుల్‌గా ఉంటాను బ్రదర్

దర్శకుడు వంశీ పైడిపల్లిపై మరోసారి ప్రశంసలు గుప్పిస్తూ మహేష్ బాబు ట్వీట్ చేశారు. ‘నా కెరీక్లో అత్యంత ఎక్కవ గర్వంగా ఫీలయ్యే సినిమా నాకు ఇచ్చావు. ఈ కథలో మహేష్ బాబును తప్ప మరొకరిని ఊహించుకోలేను అని నువ్వు చెప్పిన మాట నాకు ఇప్పటికీ గుర్తుంది. ఇంతకంటే పెద్ద కాంప్లిమెంట్ ఏమీ ఉండదు సోదరా... నీకు ఎప్పుడూ గ్రేట్ ఫుల్‌గా ఉంటాను' అని మహేష్ బాబు తెలిపారు.

ఇలాంటి మంచి సినిమలు చేస్తూనే ఉండు

‘మహర్షి' మూవీ మనసుతో చేశాను అని చెప్పావు. నువ్వు మనసు పెట్టి చేసిన సినిమా కాబట్టే ఈ చిత్రం ఇంత పెద్ద విజయం అందుకోవడంతో పాటు ప్రేక్షకుల హృదయాలను గెలచుకుంది. నీ మీద ప్రేమ, గౌరవం మరింత పెరిగింది. ఇలాంటి మంచి సినిమాలు ఎన్నో అందించాలని కోరుకుంటున్నానట్లు వంశీ పైడిపల్లిని ఉద్దేశించి మహేష్ బాబు ట్వీట్ చేశారు.

బాక్సాఫీసు వద్ద దూసుకెళుతున్న ‘మహర్షి'

మరో వైపు బాక్సాఫీసు వద్ద ‘మహర్షి' చిత్రం భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకెళుతోంది. ఆదివారంతో 11 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం రూ. 90 కోట్లకుపైగా వరల్డ్ వైడ్ షేర్ సాధించింది. త్వరలోనే ఈ చిత్రం రూ. 100 కోట్ల షేర్ వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.

మహర్షి

మహేష్ బాబు కెరీర్లో 25వ చిత్రంగా ‘మహర్షి' తెరకెక్కింది. పూజా హెడ్గే హీరోయిన్‌గా నటించగా... అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించారు. ఇంకా ఈ చిత్రంలో అనన్య, మీనాక్షి దీక్షిత్, జగపతి బాబు, రాజేంద్రప్రసాద్, సాయి కుమార్, ముఖేష్ రిషి, ప్రకాష్ రాజ్, నాజర్, నరేష్, పోసాని, జయసుధ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి నిర్మాతలు.

English summary
"Director Vamshi u have given me my finest and proudest film till date... still remember the day when u said no one else can play this part other than Mahesh Babu. That for me, brother, is the biggest compliment ever. Will always be grateful to you. Continue making films with ur heart like #Maharshi, and win hearts. Love and Respect." Mahesh Babu tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more