రాజమౌళికే అది సాధ్యం... మా సినిమాకు నిర్మాత ఆయనే.. ఖాళీగా ఉండి ఆయన ట్వీట్లు.. మహేష్ సెటైర్
గత కొద్దికాలంగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్‌లో సినిమా వస్తుందనే విషయంపై చర్చ జరుగుతున్నది. అయితే మీడియాలో వార్తలు తప్పా దాని గురించి పురోగతి చెందిన దాఖలాలు లేవు. అయితే ఈ వార్తలపై ప్రిన్స్ మహేష్ క్లారిటీ ఇచ్చారు. మహర్షి సినిమా ప్రమోషన్‌లో భాగంగా బాలీవుడ్, హాలీవుడ్ భాషల వైపు చూసేది లేదు అని ఆయన స్పష్టం చేశారు. మహేష్ వెల్లడించిన విషయాలు ఇవే..

హిస్టారికల్ మూవీలో
చారిత్రాత్మక నేపథ్యం ఉన్న చిత్రాల్లో నటించాలని ఉంది. కానీ దర్శకుడిని బట్టి.. ఆయన చెప్పే కథను బట్టి సినిమా చేస్తాను. హిస్టారికల్ సినిమాలు తీయడం అంటే అందరితీ కాదు. ఒకవేళ రాజమౌళి లాంటి దర్శకులైతే గుడ్డిగా నమ్మవచ్చు. అలాంటి డైరెక్టర్లు వస్తే హిస్టారికల్, జానపద చిత్రంలో నటిస్తాను. ఒప్పుడు కొత్తదనం కోసం ఎదురుచూస్తాను అని మహేష్ అన్నారు.

జక్కన్నతో సినిమా ఉంటుంది
రాజమౌళి దేశం గర్వించ దగిన డైరెక్టర్. ఆయన సినిమాకు అన్ని భాషల్లో అభిమానులున్నారు. ఆయనతో డిస్కషన్ పూర్తయింది. ఆయన కమిటమెంట్స్, నా కమిట్‌మెంట్స్ పూర్తయ్యాక కె.ఎల్. నారాయణ నిర్మాతగా సినిమా ఉంటుంది. అలాగే త్రివిక్రమ్‌గారితో కూడా సబ్జెక్ట్ డిస్కషన్ జరిగింది. అది కూడా పూర్తి పాజిటివ్‌గా ఉంది అని మహేష్ వెల్లడించారు.

మల్టీ స్టారర్ సినిమాల గురించి
మల్టీ స్టారర్ చిత్రాలు తీయడమంటే సాధారణమైన విషయం కాదు. కథ, కథనాలు చాలా ముఖ్యం. అంతేకాకుండా అగ్రహీరోలను డీల్ చేసే డైరెక్టర్లు కావాలి. రాజమౌళి లాంటి డైరెక్టర్లకు స్టార్ హీరోలను డైరెక్ట్ చేసే సత్తా ఉంది. ఇంకా కొంత మంది దర్శకులకు కూడా ఆ పత్రిభ ఉంది. మంచి స్టోరి వస్తే మల్టీస్టారర్ చిత్రాల్లో నటించడానికి నేను రెడీ అని మహేష్ అన్నారు.

హాలీవుడ్ స్టార్‌పై మహేష్ బాబు సెటైర్
ఇంటర్నేషనల్ స్పై థ్రిల్లర్ సినిమా తీద్దాం అని హాలీవుడ్ నటుడు బిల్ డ్యూక్ చేసిన రిక్వెస్ట్‌పై మహేష్ బాబు సెటైర్లు వేశాడు. ఆయన ఖాళీగా ఉన్నాడేమో.. అందుకే ట్వీట్లు చేస్తున్నాడని చెప్పి నవ్వుల్లో మునిగిపోయాడు. గత కొద్దికాలంగా తెలుగు సినిమాలు తప్ప మరే భాష సినిమాల్లోకి వెళ్లనని మహేష్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల బిల్ డ్యూక్ .. లాస్ ఏంజెలెస్‌కు వస్తే కలవడం.. మనం ఇంటర్నేషనల్ స్పై థ్రిల్లర్ సినిమా గురించి చర్చిద్దాం అని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











