నిద్రకుముందు నేను అది చేస్తాను కాబట్టే...మహేష్ బాబు
నిద్రకు ఉపక్రమించే ముందు నేను సెల్ప్ హెల్ప్ పుస్తకం చదువుతాను ...ఎందుకంటే నా మైండ్ ఎప్పుడూ బిజీగా రకరకాల ఆలోచనలో ఉంటుంది. చాలా ఒత్తిడి నా మైండ్ మీద పడుతుంది అంటూ తన స్మైల్ వెనకున్న సీక్రెట్ ని వివరిస్తున్నారు మహేష్. రీసెంట్ గా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు. అయితే అవి మీకు ఎంత వరకూ ఉపయోగపడుతున్నాయి అంటే..అది నేను స్పష్టంగా చెప్పలేను కానీ..జనాలతో నేను మరింత బాగా కనెక్టు అవటానికి అవి ఉపకరిస్తున్నాయి. అన్నారు.ఇక తాను ఫిక్షన్ కి దూరంగానే ఉంటానన్నారు. ప్రస్తుతం మహేష్ ...శ్రీను వైట్ల దర్శకత్వంలో దూకుడు చిత్రం చేస్తున్నారు. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో చిత్రం చేయటానికి కమిటయ్యారు.


Click it and Unblock the Notifications











