»   »  మహేష్ బాబు సొంత నిర్మాణ సంస్థ ప్రారంభం (ఫోటో)

మహేష్ బాబు సొంత నిర్మాణ సంస్థ ప్రారంభం (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్‌బాబు నిర్మాతగా మారనున్నారా? త్వరలో సొంతంగా ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించబోతున్నారా? అంటూ ఈ మధ్య కాలంలో మీడియాలో వార్తలు వెలువడ్డ సంగతి తెలిసిందే. నిజమే మహేష్ బాబు నిర్మాతగా మారారు. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు ‘శ్రీమంతుడు' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ చిత్ర నిర్మాతల్లో మహేష్ బాబు కూడా ఒకరు.

‘జి. మహేష్ బాబు ఎంటర్టెన్మెంట్ ప్రై.లి' పేరుతో మహేష్ బాబు నిర్మాణ సంస్థను నెలకొల్పారు. ‘శ్రీమంతుడు' ఫస్ట్ లుక్ పోస్టర్ మీద మహేష్ బాబు నిర్మాణ సంస్థకు సంబంధించిన లోగో కూడా ప్రచురించారు. దీంతో మహేష్ బాబు నిర్మాణ సంస్థ ఈ సినిమాతోనే లాంచ్ అయినట్లయింది.

మహేష్ బాబు ఫ్యామిలీ ఇప్పటికే సినీ నిర్మాణ రంగంలో ఉన్నప్పటికీ.....ఆయన మాత్రం కేవలం నటుడిగానే కొనసాగుతూ వస్తున్నారు. అయితే ‘శ్రీమంతుడు' సినిమాలో తన నిర్మాణ భాగస్వామ్యం కూడా ఉండటం గమనార్హం.

Mahesh Babu own production house 'MB'

ప్రస్తుతం తెలుగు సినిమా రంగంలో పోటీని తట్టుకోవాలంటే.....కేవలం నటనకే పరిమితం కాకుండా అన్ని విభాగాల్లోనూ పట్టు సాధించాలనే ఆలోచనతోనే మహేష్ బాబు సినీ నిర్మాణ రంగం వైపు అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఆయన బేనర్లో త్వరలో స్మాల్ బడ్జెట్ సినిమాలు నిర్మించే అవకాశం ఉంది.

సౌతిండియా స్టార్ హీరోల్లో చాలా మంది తమ సొంత నిర్మాణ సంస్థలను నెలకొల్పాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్, హీరో సూర్య కొత్తగా తమ సొంత నిర్మాణ సంస్థలను పెట్టుకున్నారు. ఇపుడు వారి లిస్టులో మహేష్ బాబు కూడా చేరారు.

English summary
Superstar Mahesh Babu has now launched his own production house “G Mahesh Babu Entertainment Pvt Ltd” that operates under the name “MB”. First ever production venture of this company is none other than “Srimanthudu”.
Please Wait while comments are loading...