మహేష్ బాబు ‘వాట్స్ నెక్ట్స్’ (వీడియో)
హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ....పలు కార్పొరెట్ ప్రొడక్ట్స్‌కి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా సమయం కేటాయిస్తున్నాడు. ఇప్పటికే థమ్స్ అప్, వివేల్, ప్రోవోగ్, ఐడియా, నవరత్న ఆయిల్స్, జాస్ అలుక్కాస్, టివిఎస్, రాయల్ స్టాగ్ మొదలైన వాటికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. వీటితో పాటు మహేష్ బాబు ఇటీవల ఫేమస్ చెప్పల్స్ బ్రాండ్ అయిన పారగాన్ కి కూడా బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేసాడు.
ఇటీవల ఈ యాడ్ షూటింగులో కూడా మహేష్ బాబు పాల్గొన్నాడు. 'వాట్స్ నెక్ట్స్' అంటూ ఈ యాడ్ ఫిల్మ్ సాగుతుంది. 'టఫ్ అండ్ స్టైలిష్' పేరుతో న్యూ కలెక్షన్ చెప్పల్ సెప్టెంబర్లో విడుదల చేయనున్నారు. మహేష్ బాబు ద్వారా ఈ కలెక్షన్ ప్రారంభింప చేసేందుకు పారగాన్ సంస్థ ప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు.
<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/d-66RZi_qnw?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>
మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే...
మహేష్ బాబు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆగడు' చిత్రం ఆడియో ఈ రోజు (ఆగస్టు 30) విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని శిల్పకళా వేదిక ఆడియో వేడుకకు వేదిక కానుంది. ఈ సెలబ్రేషన్స్ లో అభిమానులు కీలక పాత్ర పోషించనున్నారు. వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఆగడు చిత్రంలో మహేష్ బాబు సరసన తమన్నా నటిస్తోంది. శృతి హాసన్ ఐటం సాంగు చేయడం మరో ప్రత్యేకత. తమన్ సంగీతం అందించారు.

'దూకుడు' వంటి భారి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత మహేష్ బాబు, శ్రీను వైట్ల, తమన్ కాంబినేషన్లో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాపై అభిమానులలో భారి అంచనాలున్నాయి. ఈ చిత్రానికి అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలు. సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











