రాజకీయం: మహేష్- పవన్ ఏకం...ఫ్యాన్స్ కూడా! (ఫోటోస్)

By Bojja Kumar

హైదరాబాద్: పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, బాలయ్య లాంటి టాప్ సినీ స్టార్ల రాకతో రాష్ట్రంలోని రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ సారి సినీ స్టార్ల గాలి అంతా తెలుగు దేశం పార్టీ వైపు వీస్తుండటం గమనార్హం. జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్....తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలకు తన మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.

తాజాగా మహేష్ బాబు కూడా తెలుగుదేశం పార్టీకి తన మద్దతు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ తరుపున తన బావ గల్లా జయదేవ్ తరుపున ప్రచారం చేస్తున్నట్లు మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా ప్రకటించడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ టీడీపీకి తమ మద్దతు ప్రకటించడంతో.... వారి అభిమానులు కూడా తెలుగుదేశం పార్టీని బల పరిచేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు.

సినిమా రంగం వరకు తీసుకుంటే.....పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఒకరితో ఒకరు పోటీ పడుతూ ముందుకు సాగుతున్న టాప్ హీరోలు. ప్రస్తుతం వీరి తర్వాతే ఏ హీరోలైనా. బాక్సాఫీసు రేసులో ఒకసారి మహేష్ బాబు‌పై చేయి సాధిస్తే, మరోసారి పవన్ కళ్యాణ్ నెం.1 స్థానంలో నిలుస్తూ వచ్చారు. అభిమానుల మధ్య కూడా అదే రకమైన పోటీ వతావరణం ఉండేది.

అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఇద్దరూ ఒకే పార్టీకి మద్దతు ప్రకటించడం, ఆపార్టీనే గెలిపించేందుకు తమ వంతు కృషి చేయడానికి పూనుకోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

టాలీవుడ్లో ఈ ఇద్దరే

టాలీవుడ్లో ఈ ఇద్దరే


ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ పొజిషన్లో కొనసాగుతున్న స్టార్ హీరోలు ఇద్దరే ఇద్దరు. వారిలో ఒకరు పవర్ స్టార్ పవర్ కళ్యాణ్, మరొకరు సూపర్ స్టార్ మహేష్ బాబు.

ఇద్దరి మధ్య స్నేహం

ఇద్దరి మధ్య స్నేహం


మరో ఆసక్తికర విషయం ఏమిటంటే....పవన్ కళ్యాణ్-మహేష్ బాబు మధ్య మంచి స్నేహ బంధం ఉంది. గతంలో పవన్ కళ్యాణ్ నటించిన ‘జల్సా' చిత్రానికి మహేష్ బాబు వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారు. అయితే సినిమాల పరంగా చూస్తే ఇద్దరూ ఒకరిని తీసిపోకుండా ఒకరు తమ సత్తా చాటుతున్నారు.

ఇద్దరూ ఒకే పార్టీకి మద్దతు

ఇద్దరూ ఒకే పార్టీకి మద్దతు


ఇన్నాళ్లు ఈ ఇద్దరు హీరోలు రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. చాలా కాలం తర్వాత ఇద్దరూ కలిసి తెలుగు దేశం పార్టీని బల పరిచేందుకు సిద్ధమయ్యారు.

అభిమానులు సైతం అదే దారిలో..

అభిమానులు సైతం అదే దారిలో..


తమ అభిమాన హీరోలు తెలుగు దేశం పార్టీని గెలిపించే దిశగా సాగుతుండటంతో...వారి వారి అభిమానులు కూడా అదే దారిలో సాగుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X