Don't Miss!
- News UN On Arvind Kejriwal: కేజ్రివాల్ అరెస్టుపై స్పందించిన ఐరాస-భారత్ కు కీలక సూచన..!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఇడియట్ మహేష్ బాబు ‘చిరంజీవి’ని కొట్టాలని ప్లాన్...
మహేష్ చిరంజీవి టార్గెట్ చేస్తున్నాడా? చిరంజీవి తర్వాత ప్రస్తుతం ఖాళీగా ఉన్న టాలీవుడ్ సింహాసనాన్ని అధిష్టించేందుకు స్కెచ్ రెడీ చేసుకుంటున్నాడా? మహేష్ ఎంచుకుంటోన్నా పాత్రలు, అతని తదుపరి చిత్రాలు చూస్తుంటే ఆ పనిలోనే ఉన్నాడేమో అనిపిస్తోంది. చిరంజీవి లాస్ట్ నంబర్ వన్ హీరో అని, ఆయన తర్వాత వారానికో కొత్త నెం.1 పుట్టుకొస్తున్నాడని అంటున్నా...నెం.1 అయ్యేందుకు రైట్ అని మహేష్ ఇప్పటికే కనుగొన్నట్టే కనిపిస్తోంది.
చిరంజీవిని టాప్ లో నిలబెట్టిన వాటిలో ప్రధానమైనవి డాన్సులన్న సంగతి అందరికీ తెలుసు. దానికి తోడు నటనలోను చిరంజీవిని కొట్టే వాళ్లు బహు అరుదు. వీటికి బోనస్ గా కామెడీని పండించడంలో చిరు సిద్దహస్తుడు. నటనలో, ఫైట్స్ లో తానేమిటనేది మహేష్ ఇప్పటికే నిరూపించేసుకున్నాడు. చిరంజీవి స్థానంలోకి రావాలంటే ఇక 'ఖలేజా" చూపించాల్సింది డాన్స్ అండ్ కామెడీల్లోనే. డాన్సుల్లో సరికొత్త స్టెప్స్ ని 'ఖలేజా" లో ఫస్ట్ అండ్ లాస్ట్ సాంగ్స్ లో చూపించ బోతున్నాడని భోగట్టా.
అయితే కామెడీ...!మహేష్ ఇంతదాకా ఎటెంప్ట్ చేయని జోనర్ ఇది. కామెడీ కూడా పండించగలిగితే మహేష్ ఫ్యాన్ బేస్ అమాంతం ఇంకో ఫిప్టీ పర్సెంట్ పెరుగుతుంది. అది గుర్తించిన మహేష్ మొట్టమొదటిసారిగా ఫుల్ టైమ్ మాస్ కామెడీని 'ఖలేజా" లో చేయబోతున్నాడు. త్రివిక్రమ్ ఇందుకోసం డిఫరెంట్ క్యారెక్టరైజేషన్, మాడ్యులేషన్, మేనరిజమ్స్ ప్రిపేర్ చేసుకున్నాడు. ఈ సినిమా తర్వాత శ్రీనువైట్ల దర్వకత్వంలో మళ్ళీ మహేష్ తనలోని సెన్సాఫ్ హ్యోమర్ ని ఎక్స్ ప్లోర్ చేయనున్నాడు.
వీటికి తోడు 'త్రీ ఇడియట్స్" రీమేక్ రూపాంలో ఫుల్ టైమ్ ఎంటర్ టైనర్ ఉండనే వుంది. మహేష్ లైనస్ చూస్తుంటేనే కామెడీని అతనెంత సీరియస్ గా తీసుకున్నాడనేది అర్థమవుతోంది. స్క్రీన్ పైనే కాదు ఆప్ స్ర్కీన్ కూడా చిరంజీవిలా మృదుస్వభావిలా మెలగుతూ, ఇతర హీరోల్ని మెచ్చుకుంటూ ఆ విధంగాను మహేష్ మనసులు దోచుకుంటున్నాడు. మహేష్ అభిమానులైతే ఇప్పటికే తమ హీరో నంబర్ వన్ అయిపోయాడని అంటారు. అయితే అఫీషియల్ గా ఇంకా ఆ ప్లేస్ మహేష్ వశం కాలేదు. ప్రస్తుతం అతడి 'దూకుడు" చూస్తుంటే త్వరలోనే అది కూడా జరిగిపోతుందనే అనిపిస్తోంది. ఆల్ ది బెస్ట్ మహేష్.